రేపు సాయంత్రం వైయస్ జగన్ తో భేటీ కానున్న వైయస్ షర్మిల..!!
TeluguStop.com
YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రేపు అన్న వైయస్ జగన్ తో( YS Jagan ) భేటీ కాబోతున్నారట.
విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో తన కొడుకు రాజారెడ్డి( Rajareddy ) నిశ్చితార్థ వేడుక మరియు వివాహ వేడుక గురించి అధికారికంగా వైయస్ షర్మిల ప్రకటించటం జరిగింది.
ఈ క్రమంలో మంగళవారం కొడుకు మరియు కాబోయే కోడలితో కలిసి ఇడుపులపాయలో వైయస్ ఘాట్ దగ్గర శుభలేఖన ఉంచి ప్రార్ధనలు చేసి తండ్రి ఆశీర్వాదాలను వైఎస్ షర్మిల తీసుకున్నారు.
ఈ సందర్బంగా మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. """/" /
పరిస్థితి ఇలా ఉండగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలో అన్న వైఎస్ జగన్ తో షర్మిల భేటీ కాబోతున్నారట.
షర్మిల వెంట తల్లి విజయమ్మ,( Vijayamma ) కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి( Priya Atluri ) కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా అన్నకు శుభలేఖ ఇచ్చి కుమారుడి వివాహానికి ఆహ్వానించబోతున్నారు.అన్న వైయస్ జగన్ తో భేటీ అనంతరం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు.
చాలాకాలం తర్వాత షర్మిల మరియు వైఎస్ జగన్ భేటీ కాబోతుండటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.
ఈ జ్యూస్ డైట్ లో ఉంటే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం..!