షర్మిల టార్గెట్ ఏంటి ? రెండు నెలల గడువు దేనికి ? 

నిన్న ఖమ్మంలో జరిగిన షర్మిల భారీ బహిరంగ సభ ద్వారా , ఆమె రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

నిన్న జరిగిన సభలో ఆమె పార్టీ పేరును ప్రకటిస్తారు అని అంతా ఊహించారు.

కానీ దానికి ఇంకా రెండు నెలలు టైమ్ ఉందని షర్మిల ప్రకటించడంతో, ఆ రెండు నెలల గడువు దేనికి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా తమతో కలిసి అడుగులు వేసే నాయకులు అందరితోనూ సమావేశాలు నిర్వహించిన షర్మిల,  ప్రధానంగా రెండు మూడు జిల్లాల పై ఫోకస్ పెట్టారు.

తాను తెలంగాణ వ్యక్తినని, ఇందులో ఎటువంటి సందేహాలు లేవని ఆమె క్లారిటీ గా చెబుతున్నారు.

అసలు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే విషయం పైన నిన్న క్లారిటీ ఇచ్చారు.

18 ఏళ్ల క్రితం తన తండ్రి ఏప్రిల్ 9వ తేదీన పాదయాత్ర చేపట్టారని విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.

"""/"/ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందనే విషయాన్ని లేవనెత్తారు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇలా అనేక ప్రధాన హామీలను లేవనెత్తారు.

అలాగే కాంగ్రెస్ బిజెపి పైన విమర్శలు చేశారు.బిజెపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పసుపు బోర్డు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అంశాలను లేవనెత్తి బీజేపీ పైన విమర్శలు చేశారు.

తాను ప్రజల కోసం పోరాడుతానని తనకు అవకాశం ఇవ్వాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అని చెప్పుకొచ్చారు.

అయితే ఏప్రిల్ తొమ్మిదో తేదీన పార్టీ పేరును ప్రకటిస్తారు అని ముందుగా పెద్దఎత్తున ప్రచారం జరిగినా, షర్మిల వెనుకడుగు వేయడానికి కారణం ఏంటి అనే విషయం పైన అందరికీ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే పార్టీలో చేరికల విషయంలో గానీ , ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకుల విషయంలో కానీ స్పష్టత రాకపోవడం, అలాగే ప్రజా ఉద్యమాలు,  ఆందోళన చేపట్టడం ద్వారా వచ్చే క్రేజ్ ను చూసి , ఆ తరువాత పార్టీ పేరు ప్రకటిస్తే వచ్చే బలం బలగం వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అందుకే రెండు నెలల గడువు లోనే ప్రజా సమస్యలపై పోరాడాలని , ప్రజల్లో తమ పార్టీపై ఆసక్తి కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారట.

  దీనిలో భాగంగానే ఈ నెల 15వ తేదీ నుంచి హైదరాబాద్ లో దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ దీక్షలో ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకుని, వారి బలం తమకు ఉండేలా చేయాలని చూస్తున్నారు.

నిరుద్యోగ సమస్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలపై పోరాడుతూ ఈ రెండు నెలల కాలంలో తన బలం నిరూపించుకుని, అప్పుడు పార్టీ పేరును ప్రకటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?