భయపెడుతున్న షర్మిల… భయపడుతున్న కేసీఆర్ ? 

మెల్లిమెల్లిగా తెలంగాణలో రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.

పార్టీ స్థాపించిన మొదట్లో ఆ పార్టీలో కాస్త ఉత్సాహమే కనిపించినా, ఆ తరువాత పార్టీ నుంచి వలస వెళ్లే నేతలు పెరిగిపోయారు.

అదే సమయంలో పార్టీలో చేరికలు పూర్తిగా నిలిచిపోవడం షర్మిల పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

అయినా ఆమె మాత్రం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపుతామంటూ ధీమా గా చెబుతున్నారు.

  అంతేకాదు తెలంగాణలో తన పట్టు పెంచుకునేందుకు పాదయాత్ర కూడా చేస్తున్నారు.       అకస్మాత్తుగా వచ్చే ఇమేజ్ తనకు అవసరం లేదని, మెల్లిమెల్లి గానే ప్రజల్లో తన గ్రాఫ్ పెంచుకుని ఎప్పటికైనా తెలంగాణ లో తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెబుతున్నారు.

తన టార్గెట్ పూర్తిగా కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యులే అంటూ చెబుతున్న ఆమె, నిత్యం కెసిఆర్ కేటీఆర్ తో పాటు , కవితను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

మొదట్లో షర్మిల విమర్శలను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరించిన టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాత్రం ఆమెను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న వ్యవహారాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

తాజాగా కెసిఆర్ ను ఉద్దేశించి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.తనను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నారు అంటూ ఆమె మాట్లాడారు.

      """/"/    షర్మిల ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా టిఆర్ఎస్ అగ్ర నాయకులు షర్మిల విమర్శలకు పెద్దగా స్పందించడం లేదు.

ఎక్కువగా హైలెట్ చేసి ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే అనవసరంగా హైప్ ఇచ్చినట్లు అవుతుందని భావించిన షర్మిల ఈ మధ్యకాలంలో స్పీడ్ పెంచడం ,వ్యక్తిగతంగా ను విమర్శలు చేస్తుండడంతో, కాంగ్రెస్ బిజెపిలో స్థాయిలోనే షర్మిల పైన టిఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది.

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న కొద్ది రాజకీయ శత్రువులు మరింతగా బలోపేతం అవుతుండడం కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తోంది.

  ఇప్పుడు షర్మిల రూపంలోనూ కొత్త ప్రత్యర్థి తమకు తలనొప్పి తెప్పిస్తుండడంతో షర్మిల మరింత టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం