YS Raja Reddy : కొడుకు రాజారెడ్డి హల్దీ వేడుక వీడియో రిలీజ్ చేసిన వైయస్ షర్మిల..!!

ఈనెల 17వ తారీకు వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి( YS Sharmila Son Raja Reddy Wedding ) వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.రాజస్థాన్ జోధ్ పూర్( Jodhpur Palace ) లో ప్యాలెస్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది.

ఫిబ్రవరి 18వ తారీకు ఉదయం క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వీరి పెళ్లి జరిగింది.

అంతకుముందే జనవరి 18వ తారీకు హైదరాబాద్ లో నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు( CM YS Jagan Couple ) హాజరయ్యారు.

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేయడం జరిగింది.

ఫిబ్రవరి 25వ తారీకు శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

"""/"/ ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులనీ ఆహ్వానించడం జరిగింది.

ఈ క్రమంలో కొడుకు రాజారెడ్డి హల్దీ కార్యక్రమానికి ( Haldi Function )సంబంధించి వీడియోని సోషల్ మీడియాలో షర్మిల పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో వైయస్ విజయమ్మ నూతన దంపతులు ఇరు కుటుంబ సభ్యులు వైయస్ షర్మిల ఉన్నారు.

అందరూ చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని బాగా ఎంజాయ్ చేయడం జరిగింది.షర్మిల కొడుకు వైయస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత చదువులు చదువుతూ ప్రియా అట్లురితో ప్రేమలో పడటం జరిగింది.

ఈ క్రమంలో తమ ప్రేమ వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులతో తెలియజేసి ఒప్పించి ఒకటయ్యారు.

వైరల్ ఫోటో : ఒకే చోట ప్రపంచంలోని అత్యంత పొట్టి , పొడవైన మహిళలు