వైఎస్ షర్మిల నిరసన దీక్ష భగ్నం

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్ష భగ్నమైంది.

పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో దీక్షను భగ్నం చేసిన పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.

పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ కేసీఆర్ కావాలనే అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకను కేసీఆర్ అణచివేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.