ఏప్రిల్ 9 విడుదల ! షర్మిల పార్టీ పేరు ఇదేనా ?

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల రాజకీయంగా వేగం పెంచారు.అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తూ వస్తున్నారు.

ఇప్పటి వరకు పార్టీ పేరును ప్రకటించకపోవడంతో ఆమె ఎప్పుడు పార్టీ పేరును జనాల్లోకి  విడుదల చేస్తారా ? అనే ఆసక్తి అటు వైఎస్ అభిమానుల్లోనూ, ఇటు తెలంగాణ ప్రజల్లోనూ నెలకొంది.

ఇప్పటికీ పార్టీ పేరు పై ఒక క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఏప్రిల్ 9 వ తేదీన పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

పార్టీ పేరు ప్రకటించే ముందుగానే పరిస్థితులు అన్నీ తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో షర్మిల ఉండగా, ఇప్పటికే టీఆర్ఎస్ తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం షర్మిలను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే షర్మిల తన పార్టీ పేరును ' వైఎస్ఆర్ టీపీ ' 'వైయస్సార్ పీటీ ' రాజన్నరాజ్యం అనే పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో తన రాజకీయ పార్టీ పేరు ప్రకటన విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.

ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 9వ తేదీన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి అప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారట.

ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఖమ్మం లో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, అదే రోజున సభావేదికపై పార్టీ పేరు ను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

అప్పటి వరకు వివిధ జిల్లాలోని, వివిధ విభాగాలకు చెందిన వారితో షర్మిల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.

"""/"/ ఇక ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశం నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశంలో 700 మంది కీలక నాయకులతో పాటు, ఐదు వేల మంది తో షర్మిల భేటీ అవుతున్నారు.

ఈ విధంగా పార్టీ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, ఆమె పార్టీతో ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్దేశంతో ఆమె పై రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి.

కాంగ్రెస్, బీజేపీలు షర్మిల కేసీఆర్ వదిలిన బాణంగా చెబుతూ విమర్శలు చేస్తుండగా, టిఆర్ఎస్ సైతం ఆమెపై విమర్శలు చేస్తోంది.

ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా, షర్మిల మాత్రం చాపకింద నీరులా తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయారు.

పెళ్లి మండపం పై రచ్చ చేసిన పెళ్లికూతురు ప్రియుడు చివరకు.. వైరల్ వీడియో..