వైయస్ షర్మిల కొత్త పార్టీ పేరు అదేనా..?!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.

రాజశేఖరరెడ్డి కుమార్తె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో ఓ రాజకీయ పార్టీ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.

ఈ పార్టీని అధికారంలోకి తీసుకవచ్చేందుకు వైయస్ షర్మిల తన వంతు ప్రయత్నంగా ఆవిడ రంగం సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ నేతలు మద్దతు ఇవ్వడం, అలాగే వైఎస్ అభిమానులతో ఆవిడ సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను ముందుగానే తీసుకుంటూ దూసుకెళుతోంది.

వీటితోపాటు తెలంగాణ యువత కూడా ఆకర్షించే పనిలో పడ్డారు వైఎస్ షర్మిల.దీనికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ యూనియన్స్ తో ఆవిడ వరుస భేటీలు నిర్వహించడమే ప్రధాన కారణం.

ఇందులో భాగంగా కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు చేసిందని ప్రశ్నించడం లాంటి ఎన్నో రకాల ప్రశ్నలను కురిపిస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే వచ్చే నెల 9న ఖమ్మంలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా.ఆ సభలోనే షర్మిల పెట్టబోయే పార్టీ పేరును కూడా అధికారికంగా ప్రకటించక బోతున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇంతలోపే షర్మిల పెట్టబోయే పార్టీ పేరు లీక్ అయినట్లు తెలుస్తోంది.

తాజాగా షర్మిల తన దగ్గరికి వచ్చిన ముఖ్య నాయకులతో సమావేశం జరపడంలో ఆవిడ మాట్లాడుతూ.

తొందరలో కార్యకర్తలను ఉద్దేశించి వచ్చే ఏడాది ఎన్నికల్లో మన "వైయస్సార్" పార్టీ అధికారంలోకి రాబోతున్నట్లు ఆవిడ నోరు జారారు.

దీంతో షర్మిల పెట్టబోయే పార్టీ పేరు 'వైయస్సార్' అని తెలుస్తోంది. """/"/ ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పెట్టబోయే ఈ పార్టీ ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆవిడ స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడానికి గల కారణం రాజన్న రాజ్యం అందించడమే తన ముఖ్య ఉద్దేశమని ఆవిడ చెప్పుకొచ్చారు.

దీంతో వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభ కీలకం కాబోతోంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒక వాల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వైయస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ఏంటి.

?! ఆ పార్టీ విధి విధానాలు ఏమిటి.? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి25, శనివారం 2025