వైయస్సార్ టిపి కి శల్య సారధ్యం చేస్తున్న షర్మిల?

కురుక్షేత్ర సంగ్రామం లో కర్ణుడు రథసారథి శల్యుడు వృత్తాంతం అందరికీ తెలిసిందే.కర్ణుని ప్రతిభ పాటవాలను తక్కువ చేసి ప్రత్యర్థులను పొగుడుతూ కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి అంతిమంగా అతని పరాజయానికి తద్వారా అతని మరణానికి కారకుడయ్యాడు.

ఇలా పక్కన ఉండి దారి తప్పించే వారిని శల్య సారధ్యంతో పోలుస్తూ ఉంటారు.

అయితే తన సొంత పార్టీని తన వ్యూహాత్మక తప్పిదాలతో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని షర్మిల( YS Sharmila ) కూడా అదే చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోవడం తో కాంగ్రెస్లో విలీనం( Congress ) దిశగా నిర్ణయం తీసుకోవడం తో ఆమె సరైన ట్రాక్ లోనే వెళ్తున్నారన్న విశ్లేషణలు వచ్చాయి.

సొంతంగా పెద్దగా బలం పుంజుకోలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ అండతో రాజకీయంగా బలపడతారని దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదుగుతారని అంచనాలు వచ్చాయి.

"""/" / అయితే కాంగ్రెస్ ఎదుగుదలను ఊహించడంలో విఫలమైన షర్మిల కాంగ్రెస్ అధిష్టానానికి అనేక షరతులు పెట్టడం, పాలేరు( Paleru ) నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పడంతోనే కాంగ్రెస్ ఇప్పుడు ఆల్టర్నేట్ వ్యూహాలను అమలు చేసింది.

దాంతో షర్మిల విలీనం నిలిచిపోయింది.ఇప్పుడు 119 స్థానాలకు పోటీ చేస్తానంటూ ప్రకటించిన షర్మిల అసలు తాను తప్ప తన పార్టీలో కీలకమైన మరో నేత పేరు చెప్పలేని స్థితిలో ఉన్నారు.

తనకున్న పరిమిత శక్తి యుక్తులను రాష్ట్రవ్యాప్తంగా ప్రసరింప చేయాలని చూడటం వ్యూహాత్మంగా అంత తెలివైన నిర్ణయం కాదని మెజారిటీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమె ఎంతగా తెలంగాణ రాజకీయలపై ఆసక్తి పెంచుకున్నా రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమెకు ఆంధ్ర మూలాల ఉన్నాయన్నది మెజారిటీ ప్రజల భావన.

"""/" / దాంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ కన్నా ఆంధ్రనే ఉపయోగకరంగా ఉంటుంది అయితే జగన్( Jagan Mohan Reddy ) రాజకీయ ప్రయాణానికి అడ్డు రాకూడదనో లేక స్వతహాగా ఆమెకు ఆంధ్ర రాజకీయ ఇష్టం లేదో తెలియదు కానీ అవకాశం లేని చోటే పదే పదే పోరాడాలని చూడటం ఆమె కు ఏ ప్రయాజనం ఇవ్వడం లేదు పైగా రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్న పాలేరు సీటు లోనే పోటీ పడాలన్న నిర్ణయం కూడా బెడిసి కొట్టే అవకాశం కనిపోస్తుంది .

ఒక వేల ఆమె బారి తేడా తో ఒడిపోతే మాత్రం ఆమె పార్టీ రాజకీయ యువనిక పై నుండి అదృశ మైపోతుంది .

చరిత్రలో ఏ మహిళా చేయనటువంటి విదం గా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళగా రికార్డులకు ఎక్కిన షర్మిల దాని తాలూకు ఫలితం అందుకోవడంలో మాత్రం వెనకబడిపోయారని చెప్పాలి .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025