ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కుటుంబాల ఉసురు పోసుకుంటున్నాడు.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నీళ్లు, నిధులు మనవే అన్నారు కానీ ఇవన్నీ దొరల సొంత చేసుకున్నారు అంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పై వైఎస్ షర్మిళ విరుచుకుపడ్డారు.

ఇక ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్ చాలా తక్కువగా ఉందని, అంతే కాకుండా గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు పోస్టింగులు ఇవ్వకుండా నానబెట్టడం దారుణమని విమర్శించారు.

ఇక గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు పోస్టింగులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.

ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాలు రాక బాధ పడుతున్న 658 కుటుంబాల ఉసురు పోసుకోంటున్న ముఖ్యమంత్రి మిగతా ఉద్యోగాలతో పాటుగా, వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు.

ఇకపోతే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఆయుష్మాన్ భారత్ లో రూ.5 లక్షల కవరేజ్ మాత్రమే అందుతుండగా, ఆరోగ్యశ్రీలో రూ.

13 లక్షల కవరేజ్ అందుతుందని దీని వల్ల తెలంగాణ ప్రజలందరికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.

రాజకీయాలలో నాకు ఎలాంటి ఆశలు లేవు.. నా జీవితం వాళ్లకే అంకితం: నాగబాబు