కొత్త బాధ్యతల్లోకి షర్మిల ! ఏపీ టూర్ ఫిక్స్

వైస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో హడావుడి మొదలుపెట్టిన వైస్ షర్మిల( YS Sharmia ) అక్కడ జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాతి పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నించారు.

కానీ షర్మిలను ఏపీ కాంగ్రెస్ లో యాక్టివ్ చేయాలనీ కాంగ్రెస్( Congress ) అధిష్టానం భావించింది.

ఈ క్రమంలోనే ఇటీవలే షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

దీంతో ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలకు ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించడంతో, ఆమె అధికారికంగా ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటి వరకు ఆమె కుమారుడి నిశ్చితార్థ వేడుకల నిమిత్తం బిజీగా ఉన్న షర్మిల ఇక ఆ తంతు ముగియడంతో ఏపీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.

"""/" / ఈ పర్యటనలో భాగంగానే ఈనెల 20న హైదరాబాదు నుంచి కడపకు షర్మిల ప్రత్యేక విమానంలో బయలుదేరి వస్తారు.

అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం నాలుగు గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు.

ఆ తరువాత మొదటగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ఆరోజు రాత్రి ఆమె అక్కడే బస చేయనున్నారు.

ఈనెల 21 ఉదయం ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

"""/" / ఉదయం 11 గంటలకు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఇక ఆ తరువాత ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు ఆమె ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.పార్టీలో చేరికలపైన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

టిడిపి, వైసిపి, బిజెపి( YCP, BJP ) లలోని అసంతృప్త నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో, షర్మిల చేరికలు, పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టమన్నారు.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..