బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్
TeluguStop.com
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రైతులు చనిపోతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది వేల మంది రైతులను ప్రభుత్వం బలితీసుకుందని మండిపడ్డారు.ఓట్ల కోసమే బీఆర్ఎస్ రైతు నినాదమని విమర్శించారు.
ఇచ్చిన హామీ మేరకు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.ఐకేపీ సెంటర్లు తెరిచి తరుగు దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు.
ఆ దేశంలో సైతం విడుదలవుతున్న ఎన్టీఆర్ దేవర.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!