షర్మిల పార్టీకి స్టార్టింగ్ ట్రబుల్ ?
TeluguStop.com
తెలంగాణలో ఎన్నో ఆశలతో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.తెలంగాణ లో పెద్ద ఎత్తున ఉన్న వైఎస్ అభిమానులు అందరిని దగ్గర చేసుకొని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను వాడుకుని, కొత్త పార్టీ ఏర్పాటు చేసి సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.
అందుకే తాను తెలంగాణ కోడలిని అనే సెంటిమెంటును ఉపయోగించి మరీ, తనకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారు.
ఈ నెల 9వ తేదీన కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పార్టీ పేరు ప్రకటించి, తగిన కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.తనకు అవకాశం ఇస్తే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని షర్మిల పదేపదే చెబుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తో పాటు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ల పైన విమర్శలు చేస్తూ, తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ముందుగా ఊహించిన స్థాయిలో షర్మిల పర్యటనకు ప్రజలు , నాయకుల నుంచి స్పందన కనిపించకపోవడంతో ఆమె డిలా పడ్డారట.
లోటస్ పాండ్ లో మొదటి సమావేశం కు వచ్చినంత స్థాయిలో రెస్పాన్స్ అయితే మిగతా చోట్ల కనిపించకపోవడం, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బయటకు వచ్చి తనకు మద్దతు ఇస్తారని ముందుగా ఊహించారు.
పార్టీ పేరును ప్రకటించిన తరువాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆమె భావిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు అంత సీన్ లేదన్నట్టుగా షర్మిల జిల్లా టూర్స్ ఉంటున్నాయట.దీంతో 9వ తేదీన ఆమె పార్టీ పేరును ప్రకటిస్తారా అనేది సందిగ్ధంగా మారింది.
కొంతకాలం పాటు వాయిదా వేసే ఆలోచనలోనూ ఆమె ఉన్నట్టుగా కనిపిస్తున్నారట. """/"/
అదీ కాకుండా ప్రస్తుతం తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, 9వ తేదీన షర్మిల నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ పై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ప్రస్తుతానికి పోలీసులు అనుమతి వచ్చినా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా భారీ బహిరంగ సభకు ఆటంకాలు ఏర్పడే అవకాశం లేకపోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే మరిన్ని ఇబ్బందులూ తప్పవు.అదీ కాకుండా గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పెద్దగా షర్మిల పెట్టబోయే పార్టీ పై ఆసక్తి చూపించకపోవడమే అందరికీ ఈ విధమైన అనుమానాలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. ఫస్ట్ డే రికార్డులు క్రియేట్ చేసిందిగా!