కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు... అసలు కారణమిదే?

తెలంగాణలో రాజకీయ పోరు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా రాజకీయాలు మారిన పరిస్థితి ఉంది.

రాజకీయాలలో మనం తెరపైకి వచ్చిన ఘటనల వెనుక ఎన్నో ఏళ్ల వ్యూహం ఉంటుంది.

దాని వెనుక చాలా రాజకీయ కారణాలు ఉంటాయి.అలాగే వచ్చిన రాజకీయ పార్టీ షర్మిల రాజకీయ పార్టీ.

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.ఓ పత్రిక రాసిన కథనం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

ఆ తరువాత చక చకా జరిగిన పరిణామాలు మనకు తెల్సిందే.అయితే ఏప్రిల్ 9 న రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తుందని అందరూ ఆశించినా షర్మిల ప్రకటించలేదు.

అయితే కరోనా నిబంధనల వల్ల 10 వేల మందికి మాత్రమే బహిరంగ సభకు అనుమతినిస్తూ పోలీసులు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించింది.

ఈ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించింది.తెలంగాణలో దొరల పాలన సాగుతుందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించడం వల్ల ప్రజల దృష్టిని మరల్చవచ్చనే వ్యూహం ఒకటి కాగా, షర్మిల మీద వస్తున్న అపోలకు చెక్ పెట్టిననట్టుందనేది షర్మిల వ్యూహంలా కనిపిస్తోంది.

కాజల్ అగర్వాల్ జీవితాన్ని మార్చేసిన బన్నీ సలహా.. అసలేం జరిగిందంటే?