కాంగ్రెస్ లోకి షర్మిల కన్ఫార్మ్ ! విజయమ్మ ఏ పార్టీలోకి ?
TeluguStop.com
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) కు తన సొంత కుటుంబానికి పెద్ద షాక్ తగలబోతోంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది.
ఈ నెల నాలుగో తేదీన షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా లీకులు విడుదల చేసింది.షర్మిల కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.
దీనికి తగ్గట్లు గానే షర్మిల సైతం కాంగ్రెస్ కు అనుకూలంగా గత కొంతకాలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే నేడు షర్మిల ఇడుపులపాయకు వెళ్ళనున్నారు. """/" /
తన కుమారుడి పెళ్లి పత్రికను వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
ఈ కార్యక్రమానికి మీడియాను సైతం ఆహ్వానించడంతో, అక్కడ షర్మిల తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించే అవకాశం ఉంది.
దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో షర్మిల రాజకీయ అడుగుల పై ఆసక్తి నెలకొంది.
షర్మిల జగన్ కు వ్యతిరేకంగానే వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది .
దీంతో టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) లు షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి మరింత ఆసక్తికరంగా చూస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.ఈ మేరకు ఆమె పులివెందులలో చేపడుతున్న కార్యక్రమాలు , భారీగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna Reddy )సైతం షర్మిల తో పాటు ఢిల్లీకి వెళ్ళనున్నారు.
"""/" /
ఇక ఏపీలో షర్మిల పూర్తిస్థాయిలో రాజకీయ మొదలు పెట్టిన తర్వాత వైసీపీలోని అసంతృప్త నాయకులను పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని షర్మిల సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి .
ఇది ఇలా ఉంటే జగన్ కు వ్యతిరేకంగానే షర్మిల ఏపీలో రాజకీయ అడుగులు వేయబోతున్న నేపథ్యంలో, ఆమె తల్లి విజయమ్మ ఎటువైపు ఉంటారనేది అటు జగన్, ఇటు షర్మిల ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం పెద్ద సంచలనంగానే మారబోతోంది.
సోలో హీరోగా వరుసగా మూడు భారీ ఫ్లాపులు.. మట్కాతో వరుణ్ లక్ష్యాన్ని సాధిస్తారా?