YS Sharmila Arrest : వైఎస్ షర్మిల అరెస్ట్ .. కారణం ఏంటంటే ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైయస్ షర్మిల( YS Sharmila ) తన సోదరుడు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు,  ఏపీలో నెలకొన్న ప్రతి సమస్యను హైలెట్ చేస్తూ విమర్శలతో విరుచుకోపడుతున్నారు .

షర్మిల వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగానే మారాయి.ఇదిలా ఉంటే ఈ రోజు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీయడంతో,  సెక్రెటరియేట్ కు బయలుదేరిన షర్మిలను పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు.

  దీంతో షర్మిల నిరసనకు దిగారు.పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి వెళ్ళేందుకు షర్మిల అంగీకరించకపోవడంతో,  తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

"""/" / ఏపీలో వైసిపి గతంలో ఇచ్చిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ( Mega Dsc ) హామీని నిలబెట్టుకోకుండా  కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ  ప్రకటించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది.

ఈరోజు ఉదయం నుంచి ఎన్టీఆర్ కృష్ణ , గుంటూరు జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఛలో సెక్రటరీయెట్ ను( Chalo Secretariat ) అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి.

ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన షర్మిల విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లోనే బస చేశారు.

ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి షర్మిల పాదయాత్రగా బయలుదేరారు.కాంగ్రెస్ నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది .

అక్కడ పార్టీ నాయకులు,  కార్యకర్తలతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు. """/" / పోలీసులు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు,  నాయకులను విడుదల చేయాలంటూ షర్మిల నినాదాలు చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆమె సెక్రటరీ బయలుదేరారు దీంతో గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు షర్మిల అరెస్టును అడ్డుకునేందుకు పార్టీ నాయకులు ప్రయత్నించినా,  పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి షర్మిల తో పాటు మరికొంతమంది పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

తీరు మార్చని టీమిండియా బ్యాటర్స్.. 150 పరుగులకే ఆలౌట్