తప్పులు సరిదిద్దుకుంటున్న జగన్ .. సీనియర్లకే ఆ ఛాన్స్
TeluguStop.com
ఏపీ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోరంగా ఓటమి చెందడం, టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో, ఇప్పుడు పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ, నాయకులకు భరోసా కల్పిస్తూ, వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ వైసిపి పుంజుకునేలా చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే పార్టీలో అనేక ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారు.దీంతో పాటు, గత ఎన్నికల సమయంలో తాను అనుసరించిన వ్యూహలు చాలావరకు బెడిసి కొట్టాయనే విషయాన్ని జగన్ గ్రహించారు.
ఈ విషయాన్ని పార్టీ నేతల వద్ద జగనే ఒప్పుకుంటూ, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే విషయం పైన చర్చిస్తున్నారు.
"""/" /
దీనిలో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.గత ఎన్నికల సమయంలో చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టడంతో రాజకీయాల్లో ప్రయోగాలు మంచిది కాదనే విషయాన్ని జగన్ గ్రహించారు.
ముఖ్యంగా సీనియర్ నేతల( Senior Leaders ) అవసరం ఎంత ఉందో గుర్తించారు.
గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా అభ్యర్థులను మార్చడం ,తన ఫోటో ఉంటే చాలు, ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని, అభ్యర్థి ఎవరనేది పట్టించుకోరని జగన్ భావించారు.
అందుకే నియోజకవర్గంలో గట్టిపట్టున్న సీనియర్ నేతలను సైతం పక్కనపెట్టి, ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి టికెట్ ఇవ్వడం వంటి ప్రయోగాలకు జగన్ తెరతీశారు.
"""/" /
ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలలో స్పష్టం అయ్యింది.ఎన్నికల సమయంలో కొంతమంది సీనియర్ నేతలు తాము ఎన్నికల్లో పోటీలో ఉండబోమని చెప్పినా జగన్ పట్టించుకోలేదు.
కొంతమంది మాత్రం జగన్ చెప్పినట్టే నడుస్తున్నారు .ఉత్తరాంధ్రలో బలమైన సీనియర్ నేతలుగా ఉన్న బొత్స సత్యనారాయణ,( Botsa Satyanarayana ) ధర్మాన ప్రసాదరావులు( Dharmana Prasadarao ) పోటీ చేసేందుకు విముఖత చూపినా, తమ వారసులను పోటీకి దింపాలని ప్రయత్నించినా, జగన్ అంగీకరించలేదు.
కానీ కొంతమంది విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా స్పందించారు .ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
మచిలీపట్నం నుంచి 2019 ఎన్నికల్లో నాని గెలిచి మంత్రి అయ్యారు.వైసీపీకి ఇప్పటికీ బలమైన వాయిస్ గా నాని మారారు మొన్నటి ఎన్నికల్లో నాని పోటీకి దూరంగా ఉండి తన వారసుడు పేర్ని కిట్టును పోటీకి దించారు.
ఆ ఎన్నికల్లో పేర్ని కిట్టు ఓటమి చెందారు.దీంతో ఇప్పుడు మళ్లీ నానిని మరింత యాక్టివ్ చేసేందుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను నానికే జగన్ అప్పగించారు.
2029 ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయాల్సిందే అనే సంకేతాలు జగన్ ఇచ్చారు.
"""/" /
ఇక చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రకటించారు.
తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని, చంద్రగిరి టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని జగన్ ను కోరగా, అందుకు అంగీకరించి మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.
అయితే ఆ ఎన్నికల్లో మోహిత్ రెడ్డి ఓటమి చెందారు.ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మళ్ళీ చంద్రగిరి బాధ్యతలను జగన్ అప్పగించారు.వచ్చే ఎన్నికల్లోనూ చెవిరెడ్డిని పోటీ చేయాల్సిందిగా జగన్ సంకేతాలు ఇచ్చారు.
ఇక తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో పోటీకి దించారు.
అభినయ రెడ్డి ఓటమి చెందారు.దీంతో మళ్లీ కరుణాకర్ రెడ్డిని యాక్టివ్ కావాలని జగన్ ఆదేశించారు .
ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలకే మళ్లీ అవకాశం ఇస్తూ , వారి అనుభవాన్ని , సలహాలను పార్టీ కోసం వాడుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారట.
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?