పవన్ ని విమర్శిస్తే జగన్ కు భారీ నష్టం తప్పదా..??

ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ ,వైసీపీలు ఎవరికి వారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

తన చిరకాల ప్రత్యర్థి టీడీపీ పై విమర్శల కంటే కూడా, జగన్ ఎక్కువగా జనసేన అధినేత పైనే దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్ట్నర్ అంటూ రోజూ జగన్ విమర్శలు చేయడం వల్ల జగన్ కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అంటున్నారు రాజకీయ పండితులు ఎలా అంటే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ జనసేన పార్టీకి ముఖ్యమైన బలం అభిమానులే.

వారి ఓటు ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ వైపుగా వెళ్ళదు.వారంతా ఖచ్చితంగా జనసేనకి ఓటు వేస్తారు.

అలాగే కమ్యూనిస్టులు ఓటుబ్యాంకు కూడా చెక్కుచెదరదు, వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకటి రెండు లేదా మూడు సీట్లు వచ్చినా వారి ఓటు బ్యాంకింగ్ వారికి ఉంటుంది.

అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి మరొక రకం అభిమానులు కూడా ఉన్నారు.

జనసేన ఆయా స్థానాల్లో గెలవదని అనుకున్నప్పుడు తమ ఓటును ఎందుకు నిరుపయోగం చేసుకోవాలని భావించిన తరుణంలో జగన్ ,పవన్ పై చేస్తున్న ప్రచారం గనుకా వారి మైండ్ లోకి వెళితే జగన్ కే భారీ నష్టం కలుగుతుందని అంటున్నారు ఎందుకంటే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ జనసేనాని కి ఓటు వేయడం వల్ల ఓటు మురుగుతుందని భావించిన తరుణంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయకుండా ఉన్న అభ్యర్థి కే పవన్ ఫ్యాన్స్ ఓటు వేస్తారు.

ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పవన్ తో పొత్తు పెట్టుకోకపోయినా సరే ప్రత్యర్ధిగా ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు సరికదా పవన్ ని ఎక్కడ విమర్శించడం లేదు.

పవన్ విషయంలో సాఫ్ట్ గానే ఉన్నారు చంద్రబాబు .పైగా జగన్మోహన్ రెడ్డి పవన్ పై రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం తో పవన్ కి పడని రెండవ రకం అభిమానుల ఓట్లు చంద్రబాబుకు మళ్లుతాయని అనడంతో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు.

మరి ఈ విషయాన్ని గ్రహించి జగన్ ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై