పేదల కలల లోగిళ్లు.. టిడ్కో ఇళ్లను అందిస్తోన్న వైఎస్ జగన్

ఏపీ పేద ప్రజల కలల సౌధాలుగా నిలుస్తున్నాయి టిడ్కో గృహాలు.వీటి కోసం పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి.

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం లేదంటూ విమర్శలు చేస్తూనే ఉంటారు.కానీ రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను ఎవరు నిర్మించారు.

? ఈ ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించారు.? రాష్ట్రంలోని పేదలకు అతి తక్కువ ధరకే ఇంకా చెప్పాలంటే సుమారు మూడు వందల అడుగులు ఉన్న చిన్నా ప్లాట్స్ ను ఉచితంగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

దాంతో పాటు మిగతా 365, 430 అడుగుల ప్లాట్స్ ను సగం ధరలకే అందించారు.

ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు ప్రజలకు కావాల్సిన తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్.

లక్షల మంది కలను సాకారం చేస్తూ వారి కళ్లల్లో సంతోషాన్ని విరబూయించేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు.

టిడ్కో గృహాల నిర్మాణాల మొత్తం ప్రాజెక్టు నిధుల్లో టీడీపీ ప్రభుత్వం కనీసం పది పైసల వంతు కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

కానీ అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడమే కాకుండా చంద్రబాబే కాకుండా పలువురు టీడీపీ నేతలు సెల్ఫీలు దిగి మభ్యపెడుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

అసలు టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు మొత్తం రూ.28 వేల కోట్లకు పైనే ఖర్చు చేయాల్సి ఉంది.

అయితే గతంలోని టీడీపీ ప్రభుత్వం అందులో ఖర్చు చేసింద సగం కంటే తక్కువే అని చెప్పొచ్చు.

కానీ తామే ఇళ్లను కట్టేశామని డప్పాలు కొట్టడం పసుపు దళానికి మాత్రమే సాధ్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"""/" / రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.

8,734కోట్లు ఖర్చు చేసింది.కరోనా మహమ్మారి విజృంభించి సంక్షోభంలో ఉన్న ఇప్పటికే సుమారు 62 వేల ఇళ్లను సర్కార్ పూర్తి చేసింది.

అంతేకాదు టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాల కోసం దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది.

తాగునీరు, రోడ్లు మరియు సివరేజీ ఇలా అన్ని వసతులను కల్పిస్తూ పేదల ఇళ్లను అద్భుతమైన నివాస సముదాయలుగా మార్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం.

అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిపోయిన రూ.3 వేల కోట్ల బిల్లుల బకాయిలను కూడా వైసీపీ సర్కార్ తీర్చింది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడు వందల అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.

3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు బుుణం చెల్లించాలి.అంటే 20 సంవత్సరాల తరువాత మొత్తం రూ.

7.2 లక్షలు అవుతుంది.

అయితే ఆ 300 అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

దీని వలన ప్రభుత్వంపై రూ.5,340 కోట్ల భారం పడుతున్న ప్రజా సంక్షేమం కోసం దాన్ని భరిస్తోంది.

అదేవిధంగా 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్‌ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా వైసీపీ ప్రభుత్వం భరించింది.

దీనివలన ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.

31 కోట్లు మరియు ఉచిత రిజిస్ట్రేషన్‌ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.

ఏపీలోని సుమారు లక్షా 43 వేల ఆరు వందల మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ప్లాట్స్ ను మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వం.

365, 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2.62 లక్షలు.

టిడ్కో నివాసాలపై సబ్సిడీల రూపంలో రూ.14,514 కోట్లు మరియు ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.

1200 కోట్లు ఇలా ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.18,714 కోట్లు.

ఇప్పటికే రాష్ట్రంలో 61,948 ఇళ్లను లబ్దిదారులకు అందించిన వైఎస్ జగన్ సర్కార్ మిగతా వారి కళ్లల్లో సంతోషాన్ని నింపడమే లక్ష్యంగా ఈ సంవత్సరం చివరి నాటికి 2,62,216 ఇళ్లను అందించనుందన్నది అసలైన వాస్తవం.

ఇంగ్లాండ్‌: ఇది మంత్రగత్తెల జైలు అట.. ఇందులోకి వెళ్లిన మహిళకు షాకింగ్ ఎక్స్‌పీరియన్స్..?