విజయవాడ నడిబొడ్డులో మరో అద్భుతానికి రెడీ అయిన జగన్ సర్కార్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి తనదైన శైలిలో వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

పాలనా పరంగా కూడా దేశవ్యాప్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు పెద్ద హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి.

చాలా వరకు ప్రభుత్వ వ్యవస్థల పనులు ప్రజల వద్దకే అన్నట్టు జగన్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో.

ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పెద్దలు కూడా ఏపీ లో జరుగుతున్న పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే విజయవాడ నడిబొడ్డులో అప్పట్లో 108, 104 ఆంబులెన్స్ వాహనాలు వేలల్లో రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా జగన్ హాట్ టాపిక్ అవ్వటం అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ నడిబొడ్డులో ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు.

దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం ఇంటివద్దకే డోర్ డెలివరీ అయ్యే రీతిలో 9,260 వాహనాలు జగన్ సర్కార్ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.

అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో రేషన్ సరుకులు కోసం చాలామంది రోజువారీ కూలీలు మరియు వృద్ధులు, రోగులు అనేక అవస్థలు పడుతూ కొంత మంది ప్రాణాలు కూడా విడిచిన సందర్భాలు ఉండటంతో ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందేలా పాలన ఉంటుందని.

మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే రీతిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.

ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు చేరే విధంగా రేషన్ డోర్ డెలివరీ అనే వినూత్న కార్యక్రమానికి జగన్ రెడీ అవటంతో ఏపీ ప్రజలు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో వైరల్: అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..