కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో వై.ఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుపతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.ఈరోజు సాయంత్రం తిరుపతి చేరుకుని.

అక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి జగన్ స్వాగతం పలుకుతున్నారు.

అనంతరం రేపు జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనబోతున్నారు.ఈరోజు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుండి తిరుపతికి జగన్ బయలుదేరనున్నారు.

ఈ క్రమంలో రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి స్వాగతం పలకనున్నారు.

అనంతరం రేణిగుంట నుండి తిరుపతికి చేరుకుంటారు.ఆ తర్వాత అమిత్ షాతో శ్రీవారిని రాత్రి 9:30 గంటలకు దర్శించుకుంటారు.

తర్వాత రేణిగుంట నుండి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి తాడేపల్లి నివాసానికి జగన్ వెళ్ళిపోనున్నారు.

 ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి చేరుకుని మధ్యాహ్నం మూడు గంటల నుండి తిరుపతి తాజ్ హోటల్ లో అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

నిన్ను వదిలేదే లేదు… మరోసారి విజయ్ దేవరకొండ అని గెలికిన అనసూయ?