కార్యకర్తలకీ కృతజ్ఞతలు తెలిపిన వైయస్ జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు సోమవారం హోరహోరీగా పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

2019 కంటే ఈసారి పోలింగ్ లో అధిక శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

దీంతో కూటమి పార్టీల నేతలు తామే అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేస్తున్నారు.మరోపక్క అధికార పార్టీ వైసీపీ నేతలు కూడా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.

వైయస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు( Welfare Schemes ) తమ పార్టీని మళ్లీ అధికారంలో కూర్చోబెడతాయని చెబుతున్నారు.

ప్రధానంగా గ్రామాలలో అత్యధికంగా ఓటింగ్ నమోదు కావటంతో పాటు ఎక్కువ శాతం మహిళలు ఓట్లు వేయటంతో.

తమ గెలుపునివ్వరు ఆపలేరని చెబుతున్నారు. """/" / ఇదిలా ఉంటే ఎన్నికలలో గెలుపు కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు వైసీపీ అధినేత సీఎం జగన్ ( CM Jagan)కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

"నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన వైసీపీ పార్టీ( YCP Party) గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను".అని ట్వీట్ చేయడం జరిగింది.

కన్జర్వేటివ్‌ల కంచుకోటను బద్ధలుకొట్టి, యూకేకు ప్రధానిగా .. ఎవరీ కీర్ స్టార్మర్..?