జగన్ పాదయాత్రకి బ్రేక్ పడుతుందా?
TeluguStop.com
ప్రజలకోసం.ప్రజా శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప.
పాదయాత్ర మొదలు కనీ వినీ ఎరుగని రీతిలో మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి.అధికారపక్షమే టార్గెట్ గా సాగిపోతున్న ఈ పాదయాత్ర ఆరునెలల పాటు సుమారుగా 3 వేల కిలోమీటర్ల సాగనుంది.
అయితే జగన్ రెడ్డి పాదయాత్ర ఇలా మొదలయిందో లేదో కానీ అలా జగన్ కి నడుం నెప్పి స్టార్ట్ అయ్యింది.
మొదటి రోజు ఎంతో ఆక్టివ్ గా కనపడిన జగన్ రెండో రోజుకే దిమ్మతిరిగిపోయి కళ్ళు బైర్లు కమ్మేశాయి.
దెబ్బకి నడుం కి బెల్టు పెట్టుకునే స్టేజికి వచ్చేశాడు.ఈ నెప్పికి ఉపసమనమ కోసం జగన్.
రోజూ ఫిజియోథెరఫి చేయించుకున్న తర్వాత నడక ప్రారంభిస్తున్నారు.డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రలో నడుం పై ఒత్తిడి పడకుండా బెల్ట్ పెట్టుకొని పాదయాత్ర సాగించారు.
తొలి రెండు రోజుల్లోనే జగన్ నడుం పట్టుకుని నడిస్తే మరి ఆరునెలలు యాత్ర సాఫీగా సాగేనా అనే అనుమానాలు ప్రతీ ఒక్కరిలో కలుగుతున్నాయి.
ఇప్పటివరకూ పూర్తయింది 70 కిలోమీటర్లే.ఇంకా నడవాల్సింది 2900 కిలోమీటర్లకు పైగానే మరి ఇలాంటి సమయంలో జగన్ పాదయాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి.
సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 125 నియోజకవర్గాల మీదుగా దాదాపు 6 నెలల పాటు.
3వేల కిలోమీటర్ల మేర జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.అయితే ముందుగానే జగన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనటంతో ఈ సుధీర్గ పాదయాత్ర చేయడం జగన్ వల్ల సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఎన్ని కష్టాలెదురైనా జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
వైసీపి నేతల కాన్ఫిడెంట్ వెనుకాల రీజన్ లేకపోలేదు.వారానికి ఒక రోజు కోర్టు వాయిదా ఉంది.
జగన్ కి రెండు రోజులు రెస్ట్ దొరుకుతుంది.దీంతో ఆయన రికవరీ అవుతారని కొందరు నమ్ముతున్నారు.
ఏది ఏమైనా సరే చంద్రబాబు లాంటి సీనియర్స్ పాదయత్రని అవలోకగా చేసేస్తే జగన్ చేయలేకపోవడం ఏమిటి అని వైసేపిలో నేతలు గొణుక్కుంటున్నారట.
అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్