జగన్ బలం పైనే దెబ్బ కొట్టేలా టిడిపి-జనసేన ప్లాన్..?
TeluguStop.com
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజలకు పెద్దపీట వేస్తోందని, అవే సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని తీసుకువస్తాయని వైసీపీ నేతలు బలంగా.
అధికార పార్టీ సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడుతుండగా.ప్రతిపక్షాలు మాత్రం అందుకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి.
ఈ ప్రచారం వల్ల వైసీపీ పార్టీ పునాదుకు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు 87 శాతం మంది ప్రజలు ఈ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రభుత్వం ఇప్పుడే కోరడం మొదలెట్టేసింది.
ఇక ఈ పథకాలన్నీ దాదాపుగా విజయవంతంగా అమలు చేయడం అనేది ప్రభుత్వానికి సానుకూల సంకేతమమే.
అందుకే అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.టీడీపీ, జనసేన మద్దతుదారులు ప్రభుత్వంపై పెద్దఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
ఈ ప్రచారం వల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
"""/"/
జగన్‌కు పాలన అనుభవం లేదని, కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ పోస్టులతో ప్రత్యర్థులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.దీంతో మధ్యతరగతి ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది.
దీంతో ప్రభుత్వం చురుగ్గా మారింది.సోషల్‌మీడియాలో తప్పుడు పోస్ట్‌లను నిరోధించేందుకు ప్రభుత్వం ఒక చట్టం కూడా తీసుకొచ్చింది.
అయితే ఈ చట్టాన్ని హైకోర్టు రద్దు చేసింది.అందుకని ఇలాంటి పోస్టులు చేసే వారిని మాత్రం ప్రభుత్వం అరెస్టు చేస్తోంది.
అలా చేయడం కూడా ఒకరకంగా ప్రభుత్వానికి ప్రతికూలమే.కానీ ఈ పోస్టులు ఆగలేదు సరికదా మరింత పెరిగాయి.
ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని అంటున్నారు.
"""/"/
కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మరొక విపరీత చర్యను ఆశించవచ్చు.మరొక పక్కా చట్టంతో ఎన్నికల వేళ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
సీనియర్లు, ముఖ్య నేతల సేవలను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ ప్రచారాన్ని తగ్గించాలని భావిస్తోంది.
మరొక వైపు అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.
మరి ఈ తీవ్ర ప్రచారంపై అధికార పార్టీ ఎంత త్వరగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
సీఎం రేవంత్ ఆదేశించారు… తెలంగాణ వచ్చేయమంటున్న హీరో నాగార్జున ?