జగన్ కు కేంద్రం ఆశీస్సులు ? పవన్ వాదనలో నిజం ఎంత ?

ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి.ముఖ్యంగా రాజధాని తరలింపు వ్యవహారం ఆ పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా, రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఇప్పటికిప్పుడు అమరావతిని రాజధానిగా తప్పించి విశాఖకు తరలించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ విషయంలో కేంద్రం కూడా జగన్ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దీనిపై వైసిపి స్పందిస్తూ తాము ప్రతి విషయాన్ని కేంద్రానికి చెప్పి చేస్తున్నామని, కేంద్ర పెద్దల అనుమతితోనే తాము ముందుకు వెళ్తున్నామని ప్రకటిస్తున్నారు.

అయితే దీనిని నిజం చేసేలా కేంద్ర బిజెపి పెద్దలు ఎవరూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టకుండా మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కానీ ఈ వాదనలో నిజం లేదని కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు.తాను బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశానని, ఈ సందర్భంగా ఏపీ రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చిందని, సీఎం జగన్ తమతో ఏ విషయం చర్చించడం లేదని, రాజధానిపై తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని వారు తనతో చెప్పినట్టుగా పవన్ చెబుతున్నారు.

"""/"/ఒకవేళ పవన్ చెప్పింది నిజమే అయితే ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు ఈ విషయంపై ఘాటుగా స్పందించి ఉండేవారని, అలాకాకుండా వారు మౌనంగా ఉండడం చూస్తుంటే వారికి జగన్ ఆశీస్సులు ఉన్నట్టుగానే అర్థం అవుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బిజెపికి చెందిన ఏపీ నేతలు మాత్రం వైసిపి తమతో ఏమీ చర్చించకుండా, తమ అభిప్రాయం తెలుసుకోకుండా రాజధానిని తరలిస్తోందని వారు చెబుతున్నారు.

అంటే రాజధాని తరలింపును తాము వ్యతిరేకించడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ, అమరావతి రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అంటూ ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.

టిడిపి అయితే ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీ స్పందించాలని, అమరావతిలో భూమి పూజ చేసింది ఆ పార్టీ కాబట్టి దీనిపై ఏదో ఒక ప్రకటన ఆయన చేయాలని కోరుతున్నారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?