అభ్యర్థుల మార్పు వెనుక జగన్ కుల లెక్కలు ఇవే !

కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేడి వేడిగా ఉన్నాయి.పార్టీని నమ్ముకున్న వారిని జగన్ పక్కనపెట్టేస్తున్నాడు.

కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి సీట్లు ఇస్తూ వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు అంటూ.ఆయన మీద ఆ పార్టీకి చెందిన నాయకులే విరుచుకుపడుతున్నారు.

అయితే.ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిపై జగన్ ఏమాత్రం స్పందించడంలేదు.

తాను చేయాలనుకున్న ఆ మార్పులు ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.అయితే జగన్ ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం కుల సమీకరణాలపై జగన్ ఒక స్పష్టమైన అభిప్రాయానికి రావడమే అని తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రస్తుతం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధ, మల్లాది విష్ణు పోటీ పడ్డారు.

అయితే మల్లాది వైపే జగన్ మొగ్గు చూపారు.విజయవాడ రాజకీయాల్లో బలమైన సామాజికవర్గానికి చెందిన రాధను దూరం చేసుకోవడానికి కారణమేంటి? అనే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది.

మరి వంగవీటి రాధాకు కలసిరాని అంశాలేంటి? ఏఏ అంశాలను బేరీజు వేసుకుని జగన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

రాధాకు సీటు నిరాకరించడానికి ప్రధాన కారణం ఆర్థికంగా ఆయన బలవంతుడు కాకపోవడం అని తెలుస్తోంది.

కోస్తాంధ్రలోని కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉన్నప్పటికీ.దానిని అనుకూలంగా మలుచుకునే శక్తి ఆయనకు లేదని వైసీపీ అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న విజయవాడ తూర్పు నుంచి గానీ, మచిలీపట్నం పార్లమెంటు నుంచి గానీ పోటీచేసేందుకు ఆయనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

దీని వలన కాపుల ఆగ్రహానికి వైసీపీ గురికాకుండా ఉంటుందని జగన్ ఆలోచన. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్‌ బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇక్కడ కాపు సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపితే ఆ ఓట్లన్నీ తమకు పడతాయని వైసీపీ అంచనా వేస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించి ఆ వర్గాల ఆగ్రహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం ప్రారంభించినట్లు సమాచారం.

ఇప్పటికే నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయను వైసీపీ ఖరారు చేసింది.గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపి పరాభవం ఎదుర్కొంది.

ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన కృష్ణదేవరాయలును బరిలో నిలిపి ఆ వర్గాన్ని ఆకర్షించాలని భావిస్తోంది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే.ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని బలమైన నేతగా ఉన్న గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ను తప్పించి బీసీ సామాజికవర్గానికి చెందిన రజనీని అభ్యర్థిగా ప్రకటించారు జగన్‌.

ఎంపీగా కమ్మ సామాజికవర్గం అభ్యర్థి ఉన్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదని, పైగా బీసీల ఓట్లన్నీ తమ ఖాతాలో పడతాయని అంచనా వేస్తోంది.

ఇలా ఎక్కడికక్కడ కుల సమీకరణాలపై సర్వే చేయించి పక్కాగా జగన్ తన స్కెచ్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర ఎన్నికల స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ ను తొలగించండి అంటూ వైసీపీ ఫిర్యాదు..!!