జగన్ ముందు చూపు ... సీనియర్ల సీన్ లేనట్టే ?

ఎక్కడ ఏ రకంగా రాజకీయం నడపాలో జగన్ కు బాగా తెలుసు.ఈ విషయంలో ఆయన బాగా ఆరి తేరిపోయారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి వరుస కష్టాలే ఎదుర్కొంటూ వచ్చిన జగన్ మళ్లీ ఆ కష్టాలు తలెత్తకుండా ఉండేందుకు రాజకీయం ఇప్పటి నుంచే ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు.

ప్రస్తుతానికి పార్టీ అధికారంలోనే ఉన్న , 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటి నుంచే సీట్ల కేటాయింపులు చేసుకుంటూ వెళుతున్నారు.ఈ విషయంలో జగన్ ని పక్కన పెట్టేశారు.

మొహమాట పడితే రాజకీయం చేయలేము అనే విషయం జగన్ గుర్తించారు.అయితే జగన్ తీసుకుంటున్న ముందు చూపు చర్యలు పార్టీలోని సీనియర్ నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

ఇప్పటికే జగన్ తమకు ప్రాధాన్యం బాగా తగ్గిం చేశారని, పదవుల్లోనూ చిన్న చూపే చూస్తున్నారని గగ్గోలు పెడుతున్న సీనియర్ నాయకులకు మరింత ఆందోళన కలిగించే విధంగా యువ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ,  వారికి కీలకమైన పదవులు కట్టబెడుతున్నారని, అంతేకాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే యువ నాయకులను ప్రోత్సహించే పనిలో జగన్ నిమగ్నమయ్యారు.

ఆ యువ నాయకులను సైతం తమకు అత్యంత సన్నిహితులైన వారిని, మొదటి నుంచి వైసీపీ విధానాలను పాటిస్తూ, తన వెంట నడుస్తున్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ,  ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు, అనుమానస్పదంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల కంటే , పదవులు, పరపతిపై ఎక్కువగా దృష్టి పెట్టే వారికి చెక్ పెట్టి, బలమైన రాజకీయ ఉద్దండులను సైతం డీ కొట్టగల సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని జగన్ ప్రోత్సహించాలని చూస్తున్నారట.

 ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ లు కానీ, వివిధ నామినేటెడ్ పదవులు కానీ, ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

దాదాపు నలభై యాభై స్థానాల్లో కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వాలి అనే ఆలోచనతో జగన్ ఉండడం తో, ఎవరి స్థానానికి ఎసరు వస్తుందో తెలియక వైసీపీ సీనియర్లు , సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారట.

దీపికా పదుకొనేకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం కాదంటూ?