ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు? మెగాస్టారేనా?

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు అన్న అంశంపై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఇక ఈ విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తర్వాత పెద్దదిక్కుగా చిరంజీవిని నియమిస్తే బాగుంటుంది అని పలువురు సెలబ్రిటీలు భావించారు.

ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీ పెద్ద ఎవరు చిరంజీవి నేనా? సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసినట్లేనా? అవుననే సమాధానాలు వినబడుతున్నాయి.

సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారు అన్న అంశం మా ఎన్నికల ముందు నుంచి వినిపిస్తూనే ఉంది.

ఈ విషయంలో నిర్మాత నటుడు అయిన మోహన్ బాబు సినీ ఇండస్ట్రీకి పెద్ద గా ఉండటం నా మౌనం చేతకానితనం కాదు.

చేయలేని తనం కాదు అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్నట్లుగా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఓ లేఖాస్త్రం ను సంధించిన విషయం తెలిసిందే.

అయితే మోహన్ బాబు ఆ లేఖను విడుదల చేసి ఇప్పటికీ వరకు దాదాపు పది రోజులు కావస్తున్నా అందుకు సంబంధించి ఎటువంటి స్పందన రాలేదు.

అంతే కాకుండా కనీసం సీఎం లతో అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా ఇక్కడ వార్తలు కూడా వినిపించడం లేదు.

"""/"/ ఏపీ పరిస్థితుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం మోహన్ బాబుకి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎవరికి కూడా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.

ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా మంత్రి పేర్ని నానితో మాట్లాడి వచ్చేయడమే తప్ప జగన్ వరకు ఎవరూ వెళ్లడం లేదు.

ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చిరంజీవి కి ఆహ్వానం పంపి చర్చించడంతో పాటు సానుకూలంగా స్పందించడం బదులు ఇవ్వడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చిరంజీవి నే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దాం అని అనగా.ఎందుకన్నా ఎప్పుడు కలిసినా విందు కే కలుద్దాం అని అనడం అది చూస్తుంటే చిరంజీవికి జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది స్పష్టమవుతోంది.

దీనితో పెద్దలను మేమే అని ప్రకటించుకున్న వారికి ఈ విషయం ఒక షాక్ ఇచ్చినట్లు అయింది అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ