పవన్ టార్గెట్ చేసిన ఎమ్మెల్యేని జగన్ అందలం ఎక్కించనున్నారా ?
TeluguStop.com
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు,మరోవైపు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు హడావిడి మొదలు కావడంతో, పవన్ సినిమాలని కాసేపు పక్కనబెట్టి ఏపీలో అడుగుపెట్టారు.
తాజాగా తిరుపతి పార్లమెంట్ స్థానంలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి, ఎన్నికల్లో పోటీ చేసే విషయం, బీజేపీతో పొత్తు విషయంపై చర్చించారు.
ఇదే క్రమంలో శనివారం ఒంగోలుకు వచ్చిన పవన్, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేని గట్టిగా టార్గెట్ చేశారు.
ఇటీవల రాంబాబుని జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు స్థానిక సమస్యలపై ప్రశ్నించారు.అయితే ఎమ్మెల్యేని ప్రశ్నించిన రెండురోజులకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు.