‘మేమంతా సిద్ధం ‘ 19 వ రోజు జగన్   యాత్ర షెడ్యూల్

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) మేమంతా సిద్ధం పేరుతో గత 18 రోజులుగా బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు.

నేటితో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది.జగన్ బస్సు యాత్ర( Jagan Bus Yatra )కు జనాల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన వస్తుండడం, భారీగా జనాలు హాజరవుతుండడం వంటివి ఉత్సాహం పెంచుతున్నాయి.

ఒకపక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.  భారీ జన సందోహం మధ్య అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra )కు జనాలు భారీ స్థాయిలో హాజరు అవుతుండడం తో,  మళ్లీ తామే అధికారంలోకి వస్తాము అనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

విజయవాడలో జగన్ పై రాయి దాడి జరిగినా, గాయం ఇంకా నయం కాకపోయినా , జగన్ బస్సు యాత్రను ముందుకే తీసుకువెళ్తున్నారు.

"""/"/ ఇక 19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిస్తే .

ఈ రోజు ఉదయం 9 గంటలకు గుడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం వరకు నక్కపల్లి పులవర్తి ఎలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది.

భోజన విరామం తరువాత నరసింగపల్లి మీదుగా చింతలపాలెం కు బస్సు యాత్ర చేరుకుంటుంది మధ్యాహ్నం 3.

30 గంటలకు చింతలపాలెం దగ్గర జగన్ బహిరంగ సభలో పాల్గొని,  ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

"""/"/ ఆ తరువాత బయ్యవరం , కసిం కోట , అనకాపల్లి బైపాస్,  అస్కాపల్లి మీదుగా చెన్నయ్యపాలెం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది.

  రాత్రి చెన్నయ్యపాలెం( Chennayapalem ) లో రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.

ఒకపక్క బస్సు యాత్ర, రోడ్డు షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే భారీ బహిరంగ సభలలోనూ జగన్ పాల్గొంటూ పార్టీ శ్రేణులు, జనాల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రాంగ్ టైం లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన మంచి సినిమాలు ఇవే !