జగన్ లాజిక్..ప్రజలలో దూసుకెళ్తోంది పవన్ కి దెబ్బేస్తుందా..??

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి ఇక కీలక సమరం తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఎన్నికలు కావడంతో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఐపీఎల్ సీజన్ లో బాల్ టూ బాల్ చూస్తున్నట్టుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక పార్టీ మరొక పార్టీని తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి.

తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిన బాబుకి దిమ్మ తిరగడంతో. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పుడు ఏపీలో రాజకీయాలపై దృష్టి పెట్టి జగన్, పవన్ ,బీజేపీ ఒక్కటే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

కాని కొన్ని నెలల క్రితం అదే బీజేపీ తో బాబు అంటకాగిన విషయం ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు.

ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు పై విరుచుకు పడుతూ అవినీతి ఆరోపణలు చేస్తూ చీల్చి చెండాడిన పవన్, జగన్ పై కూడా దృష్టి పెట్టి ఇప్పుడు బాబు ,జగన్ లపై పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక జగన్ కూడా చంద్రబాబు పాలనకి చరమ గీతం చెప్పాలి మరో సారి రాజన్న రాజ్యం రావాలి , అంటూ ప్రజలకి వైఎస్ఆర్ పాలనని గుర్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో తనని బాబు కంటే దారుణంగా టార్గెట్ చేస్తున్న పవన్ పై జగన్ వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తున్నారు.

జగన్ లాగుతున్న లాజిక్ పాయింట్స్ ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.అదేంటంటే.

!!! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టీడీపీ, జనసేన పార్టీలని ఎట్టిపరిస్థితిలో నమ్మే ప్రయత్నం కూడా చేయవద్దని, ఇద్దరూ కూడా ప్రజలను మభ్యపెట్టి 2014లో అధికారంలోకి వచ్చిన విషయం మరిచిపోవద్దని.

రాష్ట్ర ప్రజలని మోసం చేసిన ఘనత ఈ ఇద్దరికి ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీ బహిరంగ సభలలో ఈ విషయాన్ని పదేపదే చెప్పడంతో ప్రజలలోకి ఈ నిజం దూసుకెళ్తోందని అంటున్నారు పరిశీలకులు.

ఒక్క సారి గతాన్ని తరికి చూస్తే ప్రత్యేకహోదా తో సహా రాజధాని నిధులకి , అభివృద్దిలో అన్నివిధాలుగా సాయం చేస్తామని.

ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ, బీజేపీ-టీడీపీల తరఫున ప్రచారం చేసిన పవన్ కూడా ఏపీ ప్రజలకి హామీలు ఇచ్చారు.

ఆ సమయంలో ప్రస్నిస్తాను అని చెప్పి ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి వేషాలు వేస్తున్నారు అంటూ జగన్ లాగిన లాజిక్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

పవన్ ఎటువంటి విషయాన్ని అయినా తన స్వార్ధం కోసం పట్టుకుంటాడు,ఎదో పరిష్కరించినట్టుగా షో చేసేస్తాడు ఆ తరువాత వదిలేస్తాడు,ఏపీ విషయంలో ఇదే జరిగింది.

అంటూ జగన్ లాగిన లాజిక్ ఇప్పుడు బాగానే పని చేస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players