జగన్ ఏడు పేజీల లేఖ .. ఎవరికి ఎందుకు ? 

గత కొద్ది రోజులుగా వైసిపి అధినేత జగన్( YS Jagan ) దూకుడు ప్రదర్శిస్తున్నారు .

తమను టార్గెట్ చేసుకుని పదేపదే టిడిపి, జనసేన ,బిజెపి కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.తాజాగా అనేక అంశాలతో ఏపీ గవర్నర్ ఎస్ .

అబ్దుల్ నజీర్ కు( AP Governor Abdul Nazir ) జగన్ ఏడు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.

ఈనెల 22వ తేదీన అసెంబ్లీ , శాసనమండలని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అనేక వక్రీకరణలు ఉన్నాయని ఆ లేఖలు జగన్ పేర్కొన్నారు.

వాటికి సంబంధించిన పూర్తి వివరాలను జగన్ వివరించారు.కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టు చేసిన అప్పుల వరకు అన్నిటిని వివరించారు.

"""/" / 2014- 2019 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) పనులు 72% పూర్తయినట్లు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని,  వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని జగన్ వివరించారు .

టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టింది 11, 923 కోట్ల రూపాయలేనని చెప్పారు 56వేల కోట్ల ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని 55,548.

87 కోట్ల రూపాయలుగా పేర్కొందని,  2014 - 19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం 11, 923 కోట్ల రూపాయలే ఖర్చు చేస్తే 72% పనులు ఎలా పూర్తవుతాయని జగన్ ప్రశ్నించారు.

"""/" / తమ ప్రభుత్వ హయంలో మౌలిక సదుపాయాల కల్పన పై ఎలాంటి ఖర్చు చేయలేదని గవర్నర్ ప్రసంగంలో ఉందని,  ఇది కూడా అవాస్తవమేనని జగన్ వివరించారు 2019 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 30,74 ,310 ఇళ్ళకు మాత్రమే మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా,  తమ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్యను 70, 11,885 కు చేర్చమని అన్నారు.

2024 జూన్ వరకు ఈ సంఖ్య ఎలా పెరిగిందో కనీసం టిడిపి అయినా చెప్పగలుగుతుందా అని జగన్ ప్రశ్నించారు.

ఇంకా అనేక అంశాలకు సంబంధించి 7 పేజీల లేఖలో గవర్నర్ కు జగన్ అన్ని విషయాల పైన క్లారిటీ ఇచ్చారు.

లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్