పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ !

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) వ్యవహారం రాజకీయ దుందుడుకు చర్యగా చాలామంది భావించారు.

ఇది కోర్టులో నిలబడే వ్యవహారం కాదని రెండు మూడు రోజుల వ్యవది లో చంద్రబాబు బయటకు వచ్చేస్తారంటూ అనేక వాదనలు వినిపించాయి.

అయితే జగన్ ప్రభుత్వం( Jagan Government ) ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్ని రకాలుగా ఆలోచించే చంద్రబాబును అరెస్టు చేసిందని కొంత కాలం పాటు బాబు ని లోపాలే ఉంచేలా పావులు కదుపుతున్నట్టుగా ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి.

"""/"/ ముఖ్యంగా ఈరోజు ఏసీబీ కోర్టు( ACB Court )లో సిఐడి పోలీసులు విచారణ కోసం చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు.

అయితే ప్రస్తుతం ఆయన ను అరెస్టు చేసిన కేసుతోపాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఆయనను విచారణ చేయడానికి ఏసీబీ పోలీసులు అనుమతి కోరారు.

దీనితో స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill Development Scam )లో బెయిల్ వచ్చినా కూడా మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడానికి సిఐడి పోలీసులు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా ? అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"""/"/ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్( Amaravati Inner Ring Road Project ) పేరుతో అనేక అక్రమాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడిందని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లు ఇష్టం వచ్చినట్లుగా మార్చి తమ అస్మదీయులకు ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందని, దీనిలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రభుత్వం అప్పట్లో సిఐడి విచారణకు ఆదేశించింది .

ఇప్పుడు ఆ కేసు ని ప్రయోగించబోతున్నట్టుగా తెలుస్తుంది .అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకులకు సంబంధించిన కేసులను వరుస పెట్టి రెడీ చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది .

పర్యట శాఖా మంత్రి రోజా వాఖ్యలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది .

సో ఎన్నికలకు ముందు వైసీపీ తన అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది.మరి ఒకదాని తర్వాత ఒకటి కోలుకోనివ్వకుండా జగన్ ప్రభుత్వం ఇస్తున్న షాకులకు తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి .

అలా పిలిస్తే మాత్రమే బాలకృష్ణకు ఇష్టం.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!