నిన్ను చూసి గర్వపడుతున్న అంటూ.. కూతురు గ్రాడ్యుయేషన్ సందర్భంగా వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కూతురు హర్ష రెడ్డి పారిస్ లో ఇన్ సీడ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయటం తెలిసిందే.

దీంతో కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో సీఎం జగన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ప్రియమైన హర్ష, నువ్వు ఎదుగుతున్న జీవిత ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.

చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.భగవంతుడు నీ పట్ల మరింత కృప చూపించాలని కోరుకుంటున్నాను.

ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్ష‌న్‌తో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డం గర్వంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

"""/" /   డిస్టింక్ష‌న్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించ‌డం ఆనందాన్ని కలిగించింది.

అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.శనివారం వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న వైయస్ జగన్ దంపతులు కూతురు అందుకున్న మాస్టర్ డిగ్రీ పట్టా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

ఈ ఫోటో వైరల్ అవుతుంది.వైయస్ జగన్ పాదయాత్ర ఇంకా రాజకీయంగా చాలా ఇబ్బందులలో ఉన్న సమయంలోనే వైయస్ హర్షిని రెడ్డి ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన పారిస్ ఇన్ సీడ్ యూనివర్సిటీలో సీటు సంపాదించడం జరిగింది.

  ఆ టైంలో వైయస్ జగన్  ఇటువంటి పరిస్థితుల్లో కూడా కూతురు అంత పెద్ద యూనివర్సిటీలో సీటు సంపాదించడం మామూలు విషయం కాదు.

నా భార్య భారతి.అన్ని విషయాలు చూసుకుంటూ ఉంది.

ఆమెను అభినందిస్తున్నాను అని తెలిపారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సీఎం జగన్ తన కూతురు ఇన్ సీడ్ యూనివర్సిటీ మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకోవటంతో తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు.

రైలు ప్రమాదంలో కాళ్లు పోయినా.. ప్రాణాలను రక్షించుకోగలిగిన యూఎస్ యువతి…