వైఎస్ భాస్కర్ రెడ్డి నిమ్స్ కు తరలింపు..!
TeluguStop.com
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయనను జైలు అధికారులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.దీంతో నిన్న అధికారులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఇవాళ నిమ్స్ కు తరలిస్తున్నారు.
రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?