వైయస్ వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy Murder ) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
రాజకీయంగా ఈ హత్య కేసు అధికార పార్టీనీ ఇరుకున పెడుతూ ఉంది.ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సీబీఐ( CBI ) అరెస్టు చేసి చంచల్ కూడా జైల్లో ఉంచడం జరిగింది.
అయితే తాజాగా భాస్కర రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది.అనారోగ్యం కారణంగా తనకు 15 రోజులపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy Bail ) తరఫున హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం 12 రోజులు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో ఎస్కార్ట్ వాహనంలోనే భాస్కర రెడ్డిని తరలించాలని.ఎస్కార్ట్ కు అయ్యే ఖర్చులు కూడా ఆయనే భరించాలని సూచించింది.
మద్యంతర బెయిల్ ముగిసిన అనంతరం.మళ్లీ కోర్టులో లొంగిపోనున్నారు.
2019 ఎన్నికల సమయంలో జరిగిన ఈ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తూ ఉంది.
పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?