వివేకా హత్య కేసు.. వైకాపా అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట
TeluguStop.com
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( Vivekananda Reddy ) హత్య కేసు సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.
విచారణ చివరి దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించిన సిబిఐ త్వరలోనే వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఎంపీ అవినాష్ రెడ్డి ( MP Avinash Reddy )ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది.
ఆ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.హత్య కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
సునీత రెడ్డి ( సునీత రెడ్డి )మరియు సిబిఐ అధికారులు కొన్ని విషయాలను పక్కన పెట్టి తనను టార్గెట్ గా చేసి ఆరోపణలు చేస్తున్నారని, తనను అందరూ హంతకుడిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
వివేక హత్య కేసు కు సంబంధించి ఒక లేఖ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
"""/" /
హత్య జరిగిన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) మాట్లాడుతూ ఆ లేఖ బాబాయ్ వివేక రాసి ఉండక పోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇప్పుడు అవినాష్ రెడ్డి మాత్రం ఆ లేఖ వివేకా రాసినాడు కచ్చితంగా హత్య డ్రైవర్ పనే అంటూ ఆరోపిస్తున్నాడు.
కావాలని సృష్టించారని అప్పుడు వైకాపా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ లేఖ విషయంలో తమ వాయిస్ మార్చడం జరిగింది.
మొత్తానికి వివేక హత్య విషయమై వైకాపా గతంలో ఒక మాదిరిగా ఇప్పుడు మరో మాదిరిగా మాట మార్చుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాకుండా పదేపదే వైకాపా నాయకులు తెలుగు దేశం పార్టీ తమపై ఈ కేసును రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వైకాపా అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఆ పని ఎలా చేయగలుగుతుందని కొందరు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసులో జగన్ మరియు భారతిలను కూడా విచారించాలంటూ కొందరు టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు.. రాజకీయ రచ్చ