ఇదేం పోయేకాలం.. పీహెచ్‌డీ చేసి అడల్ట్ స్టార్‌గా మారింది.. కట్ చేస్తే..?
TeluguStop.com
ఒకప్పుడు సైన్స్ పరిశోధకురాలు కావాలని కలలు కన్న ఒక పీహెచ్‌డీ( PhD ) విద్యార్థిని జారా దార్( Zara Dar ) జీవితం ఊహించని మలుపు తిరిగింది.
అకడమిక్ ప్రపంచానికి వీడ్కోలు చెప్పి, ఓన్లీఫ్యాన్స్( OnlyFans ) అనే అడల్ట్ కంటెంట్ వేదికపై తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది.
ఈ సంచలన నిర్ణయం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో విజయాలు ఉన్నాయి.మిలియన్ డాలర్ల సంపాదనతో జారా తన కుటుంబానికి అండగా నిలిచింది.
ఇంటి రుణాలు తీర్చడం, కొత్త కారు కొనడం, తమ్ముడు చెల్లెళ్లను చదివించడం, ఇలా ఎన్నో బాధ్యతలు తన భుజాలపై వేసుకుంది.
ఇప్పుడు సొంత ఇల్లు, పెట్టుబడులు అంటూ తన భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటోంది.కానీ, ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.
తన పీహెచ్‌డీ స్నేహితులు ఉన్నత స్థానాల్లో ఉండటం చూసినప్పుడు, ఒక్కోసారి తన నిర్ణయాన్ని ప్రశ్నించుకుంది.
"""/" /
"పీహెచ్‌డీ డ్రాపౌట్ టు ఓన్లీఫ్యాన్స్ మోడల్" అనే తన యూట్యూబ్ వీడియోలో జారా తన మనసులోని మాటలను వెల్లడించింది.
"పీహెచ్‌డీని వదిలేయడం ( PhD Dropout ) అంత సులువు కాదు.ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను.
ఇది ఒక పెద్ద జూదంలాంటిది" అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.లింక్డ్‌ఇన్‌లో తన స్నేహితుల ప్రొఫైల్స్ చూసినప్పుడు కలిగే భావాలను కూడా దాచకుండా నిజాయితీగా పంచుకుంది.
"""/" /
జారా దృష్టిలో కార్పొరేట్ ఉద్యోగాలు బోలెడు ఒత్తిడితో కూడుకున్నవి.ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ సెలవులు, నచ్చని పని ఇలా ఎన్నో సమస్యలు.
కానీ, జారా స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంది.తనకు ఇష్టమైన వాటిపై దృష్టి పెట్టొచ్చు, ఎటువంటి ఆంక్షలు లేకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు.
ఐతే, ఈ కొత్త జీవితంలో కొన్ని భయాలు ఉన్నాయి.పోటీ లేకపోవడం వల్ల ప్రేరణ కోల్పోతానోమోనని, అతిగా కష్టపడి ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటానేమోనని భయపడుతుంది.
అమెరికాలో ప్రొఫెసర్ల జీవితం పైకి కనిపించేంత గొప్పగా ఉండదని జారా అంటోంది.వాళ్ళు పరిశోధనల కన్నా ఫండింగ్ కోసం ప్రతిపాదనలు రాయడంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తారని, అది తనకు నచ్చలేదని చెబుతోంది.
అయితే ఆమె పీహెచ్‌డీ పట్టా పొంది ఇలా అడల్ట్ స్టార్ గా( Adult Star ) మారటం బాగోలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు ఇదేం పోయే కాలం అని ప్రశ్నిస్తున్నారు.https://youtu!--be/_uEG0H4RXcA?si=s2-Ox_HkcWqjVdcD లింక్ మీద క్లిక్ చేసి ఆమె గురించి తెలుసుకోవచ్చు.
మరిగే నీటితో ఐస్ చేయాలనుకుంది.. చివరికి ఏమైందో చూస్తే వణుకు పుడుతుంది!