రూ.74 లక్షల విలువైన కారులో పచ్చిగడ్డి తీసుకెళ్లిన యూట్యూబర్‌.. వీడియో వైరల్..

భారతీయ( Indian ) రోడ్లపై తరచుగా మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింత సంఘటనలు కనిపిస్తుంటాయి.

అలాగే వాహనదారులు చేసే కొన్ని పనులు మనల్ని నోరెళ్లపెట్టేలా చేస్తాయి.అలాంటి కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సాధారణంగా పచ్చ గడ్డి లేదా ఆవు మేతను తీసుకెళ్లడానికి ట్రాక్టర్ లేదా మామూలు ద్విచక్ర వాహనం వాడతారు.

అయితే ఒక వ్యక్తి మాత్రం తన ఆవులకు మేతను తీసుకెళ్లడానికి ఏకంగా అత్యంత ఖరీదైన ఫోర్డ్ మస్టాంగ్‌ను ఉపయోగించాడు.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో దీన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు.

"""/" / ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అప్పటి నుండి, ఈ వీడియో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది.ఈ వీడియోను మిస్టర్ ఇండియన్ హ్యాకర్( Mr.

Indian Hacker ) అనే యూజర్ నేమ్ గల ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో, నల్లటి ఫోర్డ్ ముస్టాంగ్‌లో పచ్చటి మేతతో రోడ్డుపై ఒకరు వెళ్లడం చూడవచ్చు.

వీడియోలో కొన్ని సెకన్ల తర్వాత కొంతమంది వ్యక్తులు కారు నుంచి గడ్డిని కిందకు దించి, ఆవులకు మేతగా అందించడం గమనించవచ్చు.

అమెరికా( America ) నుంచి ఇండియాకి దిగుమతి అయిన ఫోర్డ్ ముస్టాంగ్ ఇక్కడ మార్కెట్‌లో చాలామంది దృష్టిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఇండియాలో ఈ కారు కొనాలంటే సుమారు రూ.74 లక్షలు చెల్లించక తప్పదు.

"""/" / ఇకపోతే వ్యవసాయ సంబంధిత ప్రయోజనాల కోసం ఇంత అత్యాధునిక వాహనాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో ఒక వ్యక్తి పాలు ఇంటింటికి తిరిగి పోయడానికి దాదాపు రూ.5 లక్షల ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ ( Harley Davidson )మోటార్‌సైకిల్‌ను వాడేశాడు.

అప్పట్లో పాల డబ్బాలతో మోటర్‌సైకిల్‌ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.

దీన్ని చూసి చాలామంది స్టన్ అయ్యారు.

వైరల్: కోడిని వెంటాడిన మొసళ్లు.. ఎవరు గెలిచారంటే?