కొత్త సినిమా ప్రకటించిన హర్ష సాయి… నిర్మాతగా సీఎం బంధువులు?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ లను ప్రారంభించి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే ఎంతోమంది కష్టాలను చూసి చలించిపోయి వారికి ఎంతో సహాయం చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నటువంటి యూట్యూబ్ హర్ష సాయి ( Harsha Sai ) గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఈయన పేదల కష్టాలను తెలుసుకొని వారికి కట్టలు కట్టలు డబ్బు అందజేస్తూ ఉన్నారు.

ఇలాంటి వీడియోలను తన యూట్యూబ్ ఛానల్( YouTube Channel )ద్వారా షేర్ చేస్తూ మరింత డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బును కూడా పేద ప్రజలకు పంచి పెడుతున్నారు.

"""/" / ఈ విధంగా హర్ష సాయి ఒక తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషలలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇలా ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి హర్ష సాయికి హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఈ విషయాన్ని గుర్తించినటువంటి కొందరు నిర్మాతలు ఈయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీప బంధువు వంశీధర్ రావు( Vamshidhar Rao) , బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మసంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

"""/" / తాజాగా మిత్ర శర్మ( Bigg Boss Mitra Sharma ) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

హర్ష సాయి హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 10 గంటలకు టీజర్ లాంచ్ జరగబోతుందని ఈమె తెలియజేశారు.

ఈ కార్యక్రమం హైదరాబాద్ జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో విడుదల కాబోతుంది అంటూ ఈ సందర్భంగా మిత్ర శర్మ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

ఇలా ఒక యూట్యూబర్ తన మొదటి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు అంటే ఈయనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!