వెనక్కు తగ్గిన బిగ్ బాస్ సరయు.. వాళ్లకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమంటూ?
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్5 కంటెస్టెంట్లలో ఒకరైన సరయు ఈ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో సరయు కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అదే సమయంలో కొంతమంది నెటిజన్ల నుంచి సరయు విమర్శలను కూడా మూటగట్టుకున్నారు.అయితే మెజారిటీ ప్రేక్షకులు మాత్రం సరయును ట్రోల్ చేశారు.
తాజాగా సరయు ఒక వివాదంలో చిక్కుకున్నారు.గతేడాది సరయు పని చేసే యూట్యూబ్ ఛానల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రమోషన్స్ లో భాగంగా మద్యం సేవించి వీడియోను విడుదల చేశారు.
అయితే ఈ వీడియోలో సరయు గణపతి బొప్పా మోరియా అని ఉన్న రిబ్బన్లను ధరించడంతో వివాదం తలెత్తింది.
పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సరయును బంజారాహిల్స్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
"""/" /
అయితే ఈ వివాదం విషయంలో సరయు వెనక్కు తగ్గారు.తనపై కేసు పెట్టిన వాళ్లకు క్షమాపణలు చెప్పడానికి తాను సిద్ధమేనని ఆమె చెప్పినట్టు సమాచారం అందుతోంది.
పిటిషనర్ కోరుకున్న విధంగా వీడియోలో ఉన్న అభ్యంతర కంటెంట్ ను తొలగిస్తానని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.
అవసరమైతే వీడియోను కూడా తొలగించడానికి తాను సిద్ధమేనని సరయు వెల్లడించారని సమాచారం. """/" /
పిటిషనర్ అయిన చేపూరి అశోక్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను కు వచ్చిన తర్వాత పోలీసులు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది.
ఏడాది క్రితం పోస్ట్ చేసిన వీడియో వల్ల సరయుకు ఇబ్బందులు తలెత్తాయి.సరయుకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కూడా ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె ఈ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
ఈ వివాదం గురించి సరయు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరితో సినిమాలు చేస్తాడా..?