అదిరిపోయే నిర్ణయం తీసుకున్న యూట్యూబ్.. ఇకపై వాటికి సెపరేట్ స్టోర్!
TeluguStop.com
ప్రముఖ వీడియో షేరింగ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
అలానే ఇది సరికొత్త ప్లాట్‌ఫామ్స్‌ని కూడా పరిచయం చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ యాప్ యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఆన్‌లైన్ స్టోర్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది.
ఛానల్ స్టోర్ పేరిట వస్తున్న ఈ స్టోర్ ఇతర స్ట్రీమింగ్ సేవలకు సభ్యత్వాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం, యూట్యూబ్ 'ఛానల్ స్టోర్' యూజర్లు యూట్యూబ్ యాప్ ద్వారా తమకు నచ్చిన స్ట్రీమింగ్ సేవలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ఈ మేరకు యూట్యూబ్ కంపెనీ ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలతో చర్చలు కూడా ప్రారంభించింది.
యూట్యూబ్ ఆన్‌లైన్ స్టోర్ తీసుకురావడానికి కనీసం 18 నెలలుగా వర్క్ చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
యూట్యూబ్ స్ట్రీమింగ్ భాగస్వాములతో సబ్‌స్క్రిప్షన్ అమౌంట్ పంచుకునే విషయమై చర్చిస్తోందని నివేదిక పేర్కొంది.
యూట్యూబ్‌లో సాంగ్స్ తప్ప ఉచితంగా దొరికే లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అనేది అంత గొప్పగా ఏమీ ఉండదని చెప్పవచ్చు.
అందుకే యూట్యూబ్ కంటే ఎక్కువగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలను ప్రజలు చూస్తున్నారు.
దీంతో యూట్యూబ్ యూజర్లను తన వైపు తిప్పుకోవాలని బెస్ట్ కంటెంట్‌ను తన యాప్ ద్వారా కొంత డబ్బుకు అందించాలని ప్లాన్ చేస్తోంది.
అలా దీని ద్వారా యూట్యూబ్ బాగా డబ్బులు కూడా సంపాదించే అవకాశం ఉంది.
మరి ఈ స్టోర్ ఎప్పుడు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది? అనే దానిపై క్లారిటీ లేదు.
గూగుల్ కూడా దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?