సరికొత్త ఫీచర్ తో యూట్యూబ్..!

నేటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరికీ యూట్యూబ్ చూసే అలవాటు ఉంటుంది.

కొందరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు.మరికొందరు మంచి సందేశాలను ప్రజలకు చేరవేస్తుంటారు.

ఇప్పుడు కరోనా టైంలో విద్య, పాఠాలు, సినిమాలు ఇలా చాలా వాటిని యూట్యాబ్ లో చూసుకుంటూ ఇంటి దగ్గరే చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు.

ఇలాంటి యూట్యూబ్ తమ యూజర్ల సంఖ్యను చేజారకుండా చూసుకుంటూనే కొత్త ఫీచర్లు జోడిస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది.

తాజాగా లోకల్ యూజర్స్‌ను పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది.దీంట్లో భాగంగా యూట్యూబ్‌లోని వీడియో టైటిల్స్, డిస్క్రిప్షన్, క్యాప్షన్‌ లను ఆటోమేటిగ్గా మాతృభాషలోకి అనువదించే కొత్త ఫీచర్‌ ను పరీక్షిస్తోంది.

ఇది అందుబాటులోకి వస్తే యూజర్ తనకు కావాల్సిన వీడియోలను తన మాతృ భాషలో క్షణాల్లో సెర్చ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఇంగ్లీష్ నుంచి పోర్చుగీస్ భాషకు ట్రాన్స్‌లేట్ చేసే ఫీచర్ మాత్రమే యూట్యూబ్‌ లో అందుబాటులో ఉంది.

దీన్ని మరిన్ని భాషలకు విస్తరించాలని యోచిస్తోంది.కాగా, ఈ కొత్త ఫీచర్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్‌పై ఆధారపడి పనిచేస్తుంది.

ఇది త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.ఇంగ్లీష్ భాషలో అంతగా ప్రావీణ్యం లేని యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేటర్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వీడియో టైటిల్స్, డిస్క్రిప్షన్, క్యాప్షన్స్ వంటి వాటిని ఇంగ్లీష్ నుంచి తమ స్థానిక భాషకు ఆటోమేటిగ్గా ట్రాన్స్‌లేట్ చేయవచ్చు.

అయితే, ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇంగ్లీష్ టైటిల్స్‌తో సెర్చ్ చేసినప్పటికీ స్థానిక భాషలలోని వీడియోలను చూడవచ్చు.

కానీ, ఆ వీడియోకు సంబంధించిన డిస్క్రిప్షన్, టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్‌లోనే చూపిస్తాయి.కొత్త ఫీచర్ వస్తే వీటికి పరిష్కారం లభించనుంది.

"""/"/ ఇక, యూట్యూబ్‌ ను స్థానిక భాషలోనే యాక్సెస్ చేసుకునే సౌకర్యం కలుగనుంది.

టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

అయితే, యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మాత్రం ఈ కొత్త అప్డేట్‌పై ఇంకా వివరాలను అధికారికంగా పంచుకోలేదు.

ఈ కొత్త ఫీచర్‌ను వెబ్ ఇంటర్ఫేస్, గూగుల్ ట్రాన్స్‌లేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను ఉపయోగించుకొని రూపొందిస్తున్నారు.

ఇది ఒకరకంగా యూట్యూబర్స్ కు శుభవార్త అనే చెప్పాలి.

నేడు జగన్ ఎన్నికల ప్రచారం .. ఎక్కడెక్కడంటే..?