పవన్ పక్కన కానిస్టేబుల్ గా అదరగొట్టిన యూట్యూబర్ మౌనికారెడ్డి..
TeluguStop.com
పవన్ కల్యాణ్ మరోసారి దుమ్మురేపాడు.భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
తొలి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.కలెక్షన్ల సునామీ సాధిస్తోంది.
తాజా హిట్ తో పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు రానా నటనకు జనాలు ఫిదా అవుతున్నారు.
మంచి కథ, అంతకు మించి కథనంతో సినిమా అదిరిపోయింది.ఈచిత్రంలో యూట్యూబ్ సంచలనం మౌనికా రెడ్డి మంచి క్యారెక్టర్ చేసింది.
తన చక్కటి నటనతో అదర గొట్టింది.చాలా మంది నటీనటులు పవన్ కల్యాణ్ సినిమాలో నటించాలని ఎదురు చూస్తుంటారు.
కనీసం ఒక్క సీన్ లో అయినా కనపడాలి అనుకుంటారు.సినిమా నటులే కాదు.
టీవీ నటులు సైతం ఆయనతో పని చేయాలని ఆశ పడుతుంటారు.ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ లో హైపర్ ఆది కూడా కనిపించాడు.
అలాగే యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన మంచి క్యారెక్టర్ చేసింది.
ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్ లలో నటించింది.అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు తో బాగా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి సూర్య సిరీస్ చేసి మంచి పేరు సంపాదించు కుంది.
తాజాగా పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుని అదుర్స్ అనిపించింది. """/" /
ఈ సినిమాతో మౌనిక చేసింది మరీ పెద్ద క్యారెక్టర్ ఏమీ కాదు.
కానీ పవన్ తో నేరుగా సీన్లు ఉండటం విశేషం.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఎస్సై గా కనిపించాడు.
మౌనిక కానిస్టేబుల్ గా యాక్ట్ చేసింది.డేనియల్ పాత్ర పోషించిన రానా కారణంగా పవన్ తో పాటు మౌనిక తమ పోలీస్ ఉద్యోగాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది.
ఆ సమయంలో పవన్, మౌనిక మధ్య వచ్చే సీన్లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.
తొలుత రానాను మంచి వాడిగా భావిస్తుంది మౌనిక.ఆ తర్వాత తన నిజ స్వరూపం తనకు తెలుసుంది.
ఆ తర్వాత తనను అసహ్యించు కుంటుంది.మౌనిక కనిపించింది తక్కువ సీన్లు అయినా.
మంచి సీన్లు కావడంతో జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు.
వీడు నా తమ్ముడు… అనసూయ మాటలకు ఎమోషనల్ అయిన రాకింగ్ రాకేష్!