యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ లో కీలక మార్పులు.. అవి ఏమిటంటే..?
TeluguStop.com
యూట్యూబ్( Youtube ) అనేది వీడియో స్ట్రీమింగ్ నెట్ వర్క్ గా అందరికీ తెలిసిందే.
చాలామంది తమకు ఉన్న టాలెంట్లను వీడియో రూపంలో మలిచి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
అయితే యూట్యూబ్ వీడియోలను అప్లోడ్ చేసే వారికోసం మానిటైజేషన్స్ రూల్స్ లో( Youtube Monetization ) కీలక మార్పులు చేసింది యూట్యూబ్.
ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.యూట్యూబ్ సృష్టికర్తలు 500 కంటే ఎక్కువ సబ్ స్కైబర్ లను పొందాలి.
మూడు నెలలలో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి.
గత ఏడాదిలో 3వేల గంటల వ్యూస్ లేదా మూడు నెలలలో మూడు మిలియన్ షార్ట్ ఫిలిం వీక్షణలు కలిగి ఉండాలి.
అదే గతంలో అయితే 1000 మంది సబ్ స్కైబర్లు, 4000 గంటల వ్యూస్ లేదా మూడు నెలలలో పది మిలియన్ల షార్ట్ లను( Youtube Shorts ) వీక్షించాలి అనే నియమాలు ఉండేవి.
"""/" /
యూట్యూబ్ లో ఇంతే కాదు ఇంకా కొన్ని నియమాలు మార్పు చేయడం జరిగింది అవి ఏమిటంటే.
? యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత ప్రకటన ఆదాయం నుండి లాభం పొందే వరకు వారి ప్రేక్షకులను పెంచుకోవాలి.
యూట్యూబ్ ప్రీమియం వెర్షన్ బ్యాగ్రౌండ్ లో పాటలు, వీడియో ప్లే అయ్యే ఫీచర్ ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇలా పాటలు, వీడియో ప్లే కావాలంటే ఈ ప్రీమియం వెర్షన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
"""/" /
యూట్యూబ్ మ్యూజిక్ యాప్( Youtube Music App ) చేసుకుందమనుకుంటే అందుకు సుమారుగా రూ.
989 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ ఐఫోన్ యూజర్లు అయితే ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే బ్యాగ్రౌండ్ లోను పాటలను వినే అవకాశం ఉంటుంది.
యూట్యూబ్ మానిటైజేషన్ లో కీలక మార్పులు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేసేవారి సంఖ్యను పెంచడంతో పాటు వారిని వీక్షించే వారి సంఖ్య కూడా భారీగా పెరగాలి అనేదే యూట్యూబ్ లక్ష్యం.
ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఎగిరే కారు.. ఇండియన్ రోడ్ల కోసమే తయారు చేశారట..?