యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్.. ఇకపై వీడియో ఎడిటింగ్ ఫోన్లోనే..!
TeluguStop.com
ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్( Youtube ) ఇకపై వీడియోలు పోస్ట్ చేసే యూజర్లు ఫోన్లోనే వీడియోలను ఎడిటింగ్ చేసుకునేందుకు వీలుగా కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ఈ యాప్ ద్వారా సులభంగా వీడియోలను రూపొందించడంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్( AI ) ఆధారంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
ఆ సరికొత్త యాప్ కు సంబంధించిన ఫీచర్స్ ఏమిటో చూద్దాం.యూట్యూబ్ క్రియేట్( Youtube Create ) వీడియో ఎడిటింగ్ యాప్ లో ప్రిసిసన్ ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటో క్యాప్షన్, వాయిస్ ఓవర్ ఆప్షన్, లైబ్రరీ ఫిల్టర్, ట్రాన్స్షన్, ఎఫెక్ట్ లాంటి ఎన్నో ఫీచర్లు ఈ యాప్ లో ఉన్నాయి.
కొత్త వీడియోలను ఎడిటింగ్( Video Editing ) చేసి అదనపు హంగులు చేర్చడంలో భాగంగా ఉచిత మ్యూజిక్ సహా మరిన్ని ఫీచర్లు ఈ యాప్ లో జత చేయడం జరిగింది.
ఈ యాప్ లోని ఫీచర్లతో చాలా సులభంగా వీడియోలను ఎడిటింగ్ చేయవచ్చు. """/" /
ప్రస్తుతం యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్ టెస్టింగ్ దశలో ఉంది.
ఈ యాప్ ముందుగా ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.ముందుగా కొన్ని దేశాలలో యూట్యూబ్ క్రియేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ను విడుదల చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
ఆ దేశాలలో భారత్ కూడా ఉంది. """/" /
కాకపోతే ఈ యాప్ IOS వెర్షన్ వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది.
వీడియో బ్యాక్ గ్రౌండ్ లను క్రియేట్ చేసే ఫీచర్ కూడా ఈ యాప్ లో ఉంది.
డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ద్వారా నచ్చిన వీడియోలు ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ సృష్టించడానికి వినియోగదారులకు అనుమతి ఇస్తుంది.
ప్రస్తుతం ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది.
2024 సంవత్సరంలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భర్త వల్లే సంతోషంగా ఉన్నాను.. కల్పన కామెంట్లతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!