ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!?

సోషల్ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి.

నిజాన్ని నిర్భయంగా చెప్పే రోజుల్లో అబద్ధాన్ని కూడా అంతే అందంగా చెప్పేస్తున్నారు.పాపం అమాయకపు ప్రజలు మాత్రం అలాంటి నకిలీ వార్తలు విని మోసపోతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు నిజం కంటే అసత్యపు ప్రచారాలే ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి.

మరి ముఖ్యంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించిన విషయంలో అయితే చాలా రకాల ఫేక్​ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

కోవిడ్​-19 వ్యాక్సిన్​ వేసుకోవడం వలన అనేక రకాలైన దుష్పరిణామాలు కలుగుతాయని కొన్ని యూట్యూబ్​ ఛానెళ్ల నిర్వాహకులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఈ నకిలీ వార్తలు నిజమేనని భావించి ప్రజలు కూడా వాక్సిన్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాక్సిన్ వేయించుకుంటే ఏదో అయిపోతుంది అనే భ్రాంతిలో ఉంటున్నారు.ఇప్పటికీ చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడిపోతున్నారు.

ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా గాని ప్రభుత్వాలు పెట్టుకున్న వ్యాక్సిన్ టార్గెట్ రీచ్ అవ్వడం లేదు.

ఈ క్రమంలోనే గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ చానెళ్లలో కరోనా వాక్సిన్​ పై ఫేక్​ న్యూస్​ ప్రచారం చేస్తున్న​ కొన్ని ఛానెళ్లపై నిషేధం విధించింది.

/br """/"/ అంతేకాకుండా పోయిన సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 1,30,000 వీడియోలను డిలీట్ చేసినట్లు యూట్యూబ్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆఫ్​ గ్లోబల్​ ట్రస్ట్​ సేఫ్టీ అధికారి మాట్​ హాల్​ ప్రిన్ తెలిపారు.

అలాగే ఒక్క యూట్యూబ్ మాత్రమే కాకుండా ఫేస్​బుక్​, ట్విట్టర్​ లో కూడా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవట.

మరి ముఖ్యంగా కరోనాకి సంబందించిన ఫేక్ వార్తలు కనుక యూట్యూబ్, ఫేస్ బుక్​, ట్విట్టర్​ లో ప్రచారం చేస్తే నిషేధం తప్పనిసరి అని పేర్కొన్నాయి.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..