యూకేలో సోమ‌రిత‌నం బాట‌లో యువ‌త‌... కార‌ణం ఇదేన‌ట‌!

బ్రిటన్‌లోని యువ‌త ఉద్యోగాలు చేయ‌కుండా స్వేచ్ఛ‌గా జీవించాల‌నుకుంటోంది.18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల 1.

7 మిలియన్లకు మించిన యువ‌కులు వారి తల్లిదండ్రుల ఆదాయంపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు.వారు ఉద్యోగం చేయ‌డం లేదు.

భవిష్యత్తులోనూ ఏ పని చేయాలనుకోవడం లేదు.వారు చ‌దువుకు కూడా దూరంగా ఉంటున్నారు.

తమ తల్లితండ్రులు చాలా సంపదను కూడబెట్టార‌ని, దీంతో తాము సుఖంగా జీవించగలమని వారంతా భావిస్తున్నారు.

మరోవైపు యూకేలో వర్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉంది.పెరిగిన ఈ భాగస్వామ్యంతో వారు మరింత స్వావలంబన స‌మ‌కూర్చుకున్నారు.

వారిలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మ‌రింత‌గా పెరిగింది.కుటుంబంలో మ‌హిళ‌ల ప్రాముఖ్య‌త పెరిగింది.

మహిళల సామాజిక హోదాలో వచ్చిన ఈ మార్పు కొత్త తరం అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిగా మారుతోంది.

యూకేలో ప్ర‌స్తుతం స్త్రీల కంటే పురుషులే అధిక‌శాతం నిరుద్యోగులుగా ఉంటున్నారు.బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ వరకు ఇక్కడ 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులలో 31.

9% మంది దేశానికి, వారి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహకారం అందించడం లేదు.

సిటీ అండ్‌ గైడ్స్ నివేదిక ప్రకారం బ్రిటన్‌లో ప్రతి పది మంది యువ‌కుల‌లో ఒకరు ఎప్పుడూ ఉద్యోగం కోసం వెతకలేదు.

"""/"/ యూకేలో 24 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు క‌లిగిన యువ‌కుల‌లో 43% మంది వారి తల్లిదండ్రులతో పంచ‌న నివసిస్తున్నారు.

వారు ఎటువంటి బాధ్యత లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మునుపటి తరం కంటే త‌మ ద‌గ్గ‌ర ఎక్కువ డ‌బ్బు ఉంద‌ని చెబుతున్నారు.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం అలాంటి యువత ఇంటి అద్దె చెల్లించరు.రేషన్ గురించి ఆందోళన చెందరు.

ఇటువంటి యువ‌త త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని విలాస వస్తువులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.

నిరుద్యోగ యువత వీడియో గేమ్‌లు ఆడుతూ కాలం గడుపుతున్నట్లు అమెరికన్ ఆర్థికవేత్తలు గ‌మ‌నించారు.

బ్రిటన్‌లో శ్రామిక జనాభా వృద్ధాప్యానికి చేరుకుంది. """/"/ దేశంలో మానవ వనరుల కొరత అధికంగా ఉంది.

కరోనా నేప‌ధ్యంలో 50 నుండి 64 సంవత్సరాల వయస్సు గల లక్షల మంది ప్రజలు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నారు.

అనారోగ్యంతో కొందరు, పని విష‌యంలో విముఖతతో కొందరు ఉద్యోగాన్ని వదిలేశార‌ని తెలుస్తోంది.బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది.

అయినా కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు మాత్రం పెరగలేదు.దీంతో యువత ఉద్యోగంపై విరక్తి చెందింది.

తక్కువ వేతనం ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.1970లో తక్కువ-ఆదాయ యువకులు 13% ఉంటే, అది ఇప్పుడు 26శాతానికి రెట్టింపు అయింది.

సర్వే ప్రకారం కేవలం 20శాతం మంది యువత మాత్రమే ప‌ని చేయ‌డాన్ని ఇష్టపడుతున్నార‌ని తేలింది.