వైరల్: ఆదర్శవంతమైన యూత్ వీరే... డెలివరీ బాయ్‌తో న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేయించారు!
TeluguStop.com
ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు అన్నీఇన్నీ కావు.ఎండ, వాన, చలిని తట్టుకొని కూడా రోడ్లపై తిరుగుతూ తమ కస్టమర్ల కోసం సేవ చేస్తూ వుంటారు.
ఆర్డర్ చేసిన ఫుడ్ ని కస్టమర్లకి త్వరగా చేర్చడం కోసం నానా పట్లు పడుతూ వుంటారు.
తీరా అంత కష్టం పడి వారు ఇచ్చిన అడ్రస్‌కు వెళ్తే ఇంతలేటుగానా వచ్చేది? అని కొంతమంది తిట్ల దండకం మొదలు పెడతారు? అంతేకాకుండా చాలామంది డెలివరీ బాయ్స్‌ను చిన్నచూపు చూస్తుంటారు.
ఇలాంటి రోజుల్లో కూడా కొంతమంది యువకులు ఓ డెలివరీ బాయ్ పట్ల చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
తాజాగా న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచమంతటా ఘనంగా ముగిసాయి.ఈ నేపథ్యంలో దాదాపుగా అందరూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సహోద్యోగులతోనే న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్‌గా జరుపుకుంటే ఆ యువకులు మాత్రం ఓ డెలివరీ బాయ్ తో జరుపుకోవడం ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
అవును, బెంగుళూరుకు చెందిన కొందరు యువకులు జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
"""/"/
ఈ క్రమంలో అతనితోనే కేక్ కట్ చేయించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
సరిగ్గా 11 గంటలకు ఫుడ్ కోసం జొమాటోలో ఆర్డర్ పెట్టారు.అయితే ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చాడు.
అంటే దాదాపుగా అప్పటికి 12 కావస్తోంది.ఇంతలో యువకులు కొత్త సంవత్సరానికి స్వాగం పలికేందుకు కేక్ కటింగ్ కు సిద్ధమవుతుందగానే డెలివరీ బాయ్ వారిముందు ప్రత్యక్షమయ్యాడు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలామంది డెలివరీ ఏజంట్లపై నోరు పారేసుకుంటారు.కానీ వీరు అలా చేయలేదు.
అతనితోనే కేక్ కటింగ్ చేయించారు.కాగా ఈ తంతు ఇపుడు వైరల్ అవుతోంది.
గేమ్ చేంజర్ సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్లు ఇవేనా..?