అతివేగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది!

అతివేగం అనేది మంచిది కాదు ఎంతమంది చెప్పినా యువతి,యువకులు మాత్రం ఈ అతివేగం కారణంగా మరో ప్రాణం బలైంది.

ఈ ఘటన తమిళనాడు లోని అవినాశి లో చోటుచేసుకుంది.బస్సును ఎడమ వైపు నుంచి ఓవర్ టెక్ చేసే సమయంలో ఒక బైకర్ బైక్ స్కిడ్ అవ్వడం తో నేరుగా బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లాడు.

దీనితో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.అతి వేగం మంచికాదని పెద్దలు ఏంతగా చెబుతున్నా పెడచెవిన పెట్టి యువతీ యువకులు వేగంగా దూసుకెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఈ అతివేగం కారణంగానే తమిళనాడు లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ల్లో రికార్డ్ అవ్వడం తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో సోషల్ మీడియా లో కూడా హల్ చల్ చేస్తుంది.అయితే ఆ యువకుడు ఎవరు,ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.