బీజేపీలో చేరిన యువత..
TeluguStop.com
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన యువకులు గురువారం పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు,అలాగే దేశంలో సుస్థిర పరిపాలన అందిస్తున్న మోడీ పాలనకు,బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరిన యువకులకు పార్టీ కండువా కప్పి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన వారిలో గంగాదారి సురేష్,బండారి శ్రీకాంత్,మర్రి మహేష్,శిలం శివ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్,అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి,కిసాన్ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాక మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి రెగట్టె రుఖ్నగౌడ్,మండల కార్యదర్శి కొత్తపల్లి వేంకట్, బూత్ అధ్యక్షులు రాము, శక్తి కేంద్రం సహా ఇంచార్జి ఇన్చార్జి వంశీ తదితరులు పాల్గొన్నారు.
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!